మలేషియాలోని సెంపాంగ్ మారియమ్మన్ ఆలయంకు మిస్ గ్రాండ్ మలేషియా 2021 విజేత లిషల్లిని కనారన్ వెళ్లింది. ఈ ఆలయంకు వెళ్లిన సందర్భంగా ఆమెకు ఏర్పడిన చేదు అనుభవాన్ని షేర్ చేసుకుంది. కనారన్ తన బాధను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ద్వారా పంచుకుంది.
తన తల్లి భారత్‌లో వుండటంతో జూన్ 21వ తేదీన సెపాంగ్ ఆలయాన్ని ఒంటరిగా సందర్శించానని.. ఆలయ ఆచారాలు తెలియని కారణంగా.. ఆమె పూర్తిగా పూజారిపై సాయం తీసుకుంది.
అయితే పూజారి అదే అదనుగా తీసుకుని ఆశీర్వాదం కోసం ప్రైవేట్ రూముకు పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని.. ఛాతీపై తాకుతూ.. భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలం అంటూ ఆ నీటిని తనపై పోశాడని.. ఈ సందర్భంగా తన బ్లౌజ్ లోపల చేయితో తాకడానికి ప్రయత్నించాడని ఇన్‌స్టా ద్వారా ఆరోపించింది.
ఈ ఘటనపై మలేషియా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని కనారన్ వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూజారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.