Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tirumala : శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రూ.25 కోట్లకు పైగా కానుకలు

Advertiesment
Tirupati

సెల్వి

, శుక్రవారం, 3 అక్టోబరు 2025 (16:06 IST)
Tirupati
కలియుగ వైకుంఠం తిరుమల కొండపై అక్టోబర్ 1 వరకు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దాదాపు ఆరు లక్షల మంది భక్తులు రూ.25 కోట్లకు పైగా కానుకలు సమర్పించారని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ బిఆర్ నాయుడు గురువారం తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, ఈ కానుకలను భక్తులు హుండీలో వేసినట్లు చైర్మన్ తెలిపారు. 
 
ఈ ఎనిమిది రోజుల బ్రహ్మోత్సవాలలో (అక్టోబర్ 1 వరకు) 5.8 లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. హుండీ ఆదాయం రూ.25.12 కోట్లుగా ఉంది అని బీఆర్ నాయుడు అన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల మహోత్సవం ద్వారా.. 26 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం  వడ్డించగా, 2.4 లక్షలకు పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. 28 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించారు. 
 
28 రాష్ట్రాల నుండి 298 బృందాలు బ్రహ్మోత్సవాలలో 6,976 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారని బీఆర్ నాయుడు చెప్పారు. ఇంకా, బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారిని అలంకరించడానికి 60 టన్నుల పువ్వులు, నాలుగు లక్షల కట్ పువ్వులు, 90,000 సీజనల్ పువ్వులను ఉపయోగించారని ఆయన చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

03-10-2025 శుక్రవారం దిన ఫలితాలు- మొండి బాకీలు వసూలవుతాయి