ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పగబట్టారా...? అంటే అవుననే అంటున్నారు. ఈ పగ వెనుక గట్టి కారణం వుందని ప్రశాంత్ కిషోర్ చెపుతున్నారట. ముఖ్యంగా బీహార్ ప్రజల DNA తెలంగాణ ప్రజల DNA కంటే తక్కువంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ చాలా ఫీల్ అవుతున్నాడట. అందువల్ల వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించి తీరుతానంటూ శపథం చేస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ టైమ్స్ నౌ టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ... ఈసారి ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఎవ్వరూ కాపాడలేరు. రాహుల్ గాంధీ, మోడీ ఎవ్వరూ రేవంత్ రెడ్డిని ఎన్నికల్లో గట్టెక్కించలేరు. బీజెపి, టీడిపి ఇలా అన్ని పార్టీలు తిరిగి అతికష్టమ్మీద ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్లీ ఇంకోసారి రేవంత్ రెడ్డి గెలిచే ప్రశ్నే లేదు. బీహార్ ప్రజల డీఎన్ఎ తెలంగాణ ప్రజల డీఎన్ఎ కంటే తక్కువ అన్నప్పుడు ఢిల్లీకి వచ్చి సహాయం చేయమని నన్ను ఎందుకు అడిగారు అంటూ ప్రశ్నించారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వెళ్లి రేవంత్ రెడ్డిని ఓడించడమే పనిగా పెట్టుకుంటాను. ఆయనను ఓడించి తీరుతాను అంటూ వ్యాఖ్యానించారు..