Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గతేడాదితో పోలిస్తే దసరా పండుగకు ముందు ఏపీ, తెలంగాణలలో 36 శాతం పెరిగిన బస్ బుకింగ్స్

Advertiesment
APSRTC

ఐవీఆర్

, మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (17:45 IST)
హైదరాబాద్: దసరా పండుగ వేళ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రయాణాల్లో బస్ బుకింగ్స్ అత్యధిక పెరుగుదలను నమోదు చేశాయి. ఈ నమోదు 36 శాతంగా ఉంది. ఈ ఏడాది దసరా పండుగ సమయంలో (సెప్టెంబర్ 22 - అక్టోబర్ 2) ప్రయాణ బుకింగ్‌లను గతేడాది (అక్టోబర్ 3 - అక్టోబర్ 12)తో పోలిస్తే... ఈ పెరుగుదల కన్పించింది. ఈ విషయాన్ని రెడ్ బస్ అధికారికంగా ప్రకటించింది.
 
రెడ్‌బస్ ప్రకారం, పండుగ సీజన్లో ఈ పెరుగుదల ప్రాంతీయ, నగరాంతర ప్రయాణాలలో పెరుగుతున్న ధోరణిని ప్రతిబింబిస్తుంది. ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా కొత్త ప్రాంతాన్ని సందర్శించడానికి లేదా కొత్త గమ్యస్థానాలను అన్వేషించడానికి ప్లాన్ చేస్తున్నందున, రోడ్డు రవాణా ప్రాధాన్యత కలిగిన ప్రయాణ తప్పనిసరిగా కన్పిస్తోంది. ఈ డేటా ప్రయాణ ప్రాధాన్యతలు, జనాభా మరియు ఆంధ్రప్రదేశ్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన మార్గాలపై విలువైన ఇన్ సైట్స్ ని కూడా అందిస్తుంది. తద్వారా ఈ ఏడాది ప్రజలు దసరాకు ఎలా సిద్ధమవుతున్నారో తెలియజేస్తుంది.
 
కీలక అంచనాలు (ఆగస్టు 15-సెప్టెంబర్ 15 మధ్య రెడ్‌బస్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించే బుకింగ్‌ల ప్రకారం)
 
ట్రాఫిక్ పరంగా ఎక్కువమంది ఎంచుకునే మార్గాలు:
హైదరాబాద్- బెంగళూరు
విజయవాడ-హైదరాబాద్
హైదరాబాద్-విజయవాడ
విశాఖపట్నం-విజయవాడ
విజయవాడ-విశాఖపట్నం
విజయవాడ-తిరుపతి
 
ఈ ప్రసిద్ధ మార్గాలు దసరా సందర్భంగా ప్రధాన నగరాలు, ప్రాంతీయ పట్టణాల మధ్య ప్రయాణికుల బలమైన ధోరణిని ప్రతిబింబిస్తాయని భావిస్తున్నారు.
 
ప్రయాణీకుల ప్రాధాన్యతలు:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 63 శాతం బుకింగ్‌లు AC బస్సుల కోసం, 36 శాతం నాన్-AC బస్సుల కోసం, ముందుగానే బుక్ చేసుకున్నప్పుడు సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికలకు బలమైన ప్రాధాన్యతను హైలైట్ చేస్తాయి.
 
60 శాతం ప్రయాణికులు స్లీపర్ బస్సులను బుక్ చేసుకోగా, 39 శాతం మంది సీటర్ బస్సులను ఎంచుకున్నారు. పండుగ ప్రయాణాలలో సౌకర్యం కోసం వివిధ ప్రాధాన్యతలను చూపుతున్నారు.
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని టాప్ బోర్డింగ్ పాయింట్లు
కూకట్‌పల్లి- హైదరాబాద్
గచ్చిబౌలి- హైదరాబాద్
మియాపూర్- హైదరాబాద్
లక్డికాపూల్- హైదరాబాద్
ఎల్బీ నగర్- హైదరాబాద్
 
ట్రావెలర్ డెమోగ్రాఫిక్స్:
బస్సు బుకింగ్‌లలో మహిళా ప్రయాణికులు 35% ఉన్నారు.
39% ప్రయాణికులు పట్టణాల నుండి, మరో 39% గ్రామాల నుండి వచ్చారు.
 
ఈ పండుగ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువమంది ప్రయాణాలు చేసేందుకు ఇష్టపడుతున్నారనే విషయాల్ని తెలియచేస్తున్నాయి. మారుతున్న ప్రయాణ విధానాలు, అంతర్రాష్ట్ర బస్సు సేవలకు పెరుగుతున్న డిమాండ్ గురించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఈ ప్రాంతంలో దసరా ఒక ముఖ్యమైన సాంస్కృతిక పండుగ కావడంతో, బస్సు బుకింగ్‌ల పెరుగుదల ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా ఉంది. అన్నింటికి మించి ప్రజలు తమకు నచ్చిన గమ్యస్థానాలకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో ప్రయాణించడానికి ఎలా సిద్ధమవుతున్నారో హైలైట్ చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో 270కి పైగా పట్టణాలకు అమెజాన్ ఫ్రెష్