Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pawan Kalyan OG Response: తెలంగాణ, ఆంధ్రలోనూ ఓజీ పరిస్థితి ఏమిటి..

Advertiesment
Chiranjeevi, Sujit, Pawan

చిత్రాసేన్

, మంగళవారం, 30 సెప్టెంబరు 2025 (16:05 IST)
Chiranjeevi, Sujit, Pawan
పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ గత గురువారంనాడు విడుదలైంది. మొదటిరోజు అత్యద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. నిన్నటితో నాలుగు రోజులకు 252 కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాత డివివి దానయ్య ప్రకటించారు. అయితే నేటినుంచి ఒక్కసారిగా సినిమా టికెట్ రేట్లు తగ్గాయి. ముందుగా అనుకున్నట్లుగా 800 రూపాయల టికెట్ రేటు కాకుండా వెంటనే రేటు తగ్గించేశారు ఎగ్జిబిటర్లు. అందుకు చాలా చోట్ల థియేటర్లు వెలవెల బోతున్నాయి. హైదరాబాద్ లోని క్రాస్ రోడ్ లోని థియేటర్లు, ఇతరత్రా చోట్ల కలెక్లు మామూలు స్థాయి కూడా లేవు.
 
ఈమధ్య విడుదలైన రోజే సూపర్ డూపర్ హిట్ అంటూ సక్సెస్ మీట్ లు కూడా పెట్టడం ప్రతి చిత్రానికి ఆనవాయితీగా మారింది. అలాగే ఓజీ కూడా సక్సెస్ కేక్ కట్ చేశారు. కానీ మొదటి రోజులో వున్నంత జోష్ ఆ తర్వాత షడెన్ గా తగ్గడానికి కారణం ఫ్యామిలీస్ థియేటర్ కు రాకపోవడమే. ఈ సినిమా రిలీజ్ కుముందే వైలర్ ఫీవర్ తో పవన్ కళ్యాణ్ బయట ఎక్కడా కనిపించలేదు. నిన్ననే తన అన్న చిరంజీవి తోపాటు కుటుంబ సభ్యులు ఓజీ సినిమా చూసి హాలీవుడ్ స్థాయిలో వుందంటూ కితాబిచ్చారు. 
 
అలా చెప్పడం సాధారణం. ఏ సినిమా అయినా బాగుందనే చెబుతారు. కానీ అంతర్లీనంగా ఓజీ చాలా లోపాలున్నాయనేది ప్రేక్షకులు తీర్పు చెప్పేశారు. అందుకే ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ రావాలంటే ఇంకా 13 కోట్లకుపైగా వసూళ్ళు రాబట్టాల్సి వుంది. ప్రస్తుత పరిస్థితులలో అంత వచ్చే సూచనలు ఎక్కడా కనిపించడంలేదు. ఇంకా దసరా పండకు రెండు రోజులే వుంది. ఆ తర్వాత కాంతార 1, ధనుష్ ఇడ్లీ కొట్టు వంటి సినిమాలతోపాటు ఓజీ కోసం చిన్న సినిమాలు ఆగిపోయివున్నాయి. అవన్నీ థియేటర్లలో రావాల్సి వుంటుంది. సో.. ఏదిఏమైనా పవన్ కళ్యాణ్ కు హరిహరవీరమల్లు తర్వాత ఓజీ కూడా కాస్త నిరాశపర్చిందనే ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి రాబోయే ఉస్తాద్ గబ్బర్ సింగ్ పై అభిమానులకు ఆశలు వున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Chiru: 4కే కన్వర్షన్ తో రీ రిలీజ్ అవుతున్న చిరంజీవి కౌబాయ్ మూవీ కొదమసింహం