Nandamuri Balakrishna, Gopichand Malineni
నందమూరి బాలకృష్ణ హిస్టారికల్ ఎపిక్ #NBK111 ను ఆయన పుట్టినరోజున అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ వీరసింహ రెడ్డి తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో కలిసి చేస్తున్న రెండవ చిత్రం. ప్రస్తుతం ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ పెద్దిని నిర్మిస్తున్న నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో, #NBK111 ను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో నిర్మించనున్నారు.
విజయ దశమి శుభ సందర్భంగా, #NBK111 నిర్మాతలు ఈ చిత్రం ప్రారంభానికి ముహూర్తం ప్రకటించారు. అక్టోబర్ 24న గ్రాండ్ ఓపెనింగ్ వేడుక జరగనుంది. మొదటిసారిగా, దర్శకుడు గోపీచంద్ మలినేని హిస్టారికల్ ఎపిక్ జానర్ లో సినిమా చేస్తున్నారు, తనదైన ముద్ర వేసిన మాస్ అప్పీల్‌ను కొత్త జానర్ కి తీసుకువస్తున్నారు.
కమర్షియల్ గా బ్లాక్‌బస్టర్‌లను అందించడంలో పేరుగాంచిన గోపీచంద్ మలినేని ఇప్పుడు నందమూరి బాలకృష్ణను ఇంతకు ముందు ఎప్పుడూ చూడని అవతార్ లో చూపించే కథనాన్ని రూపొందిస్తున్నారు. గొప్ప చారిత్రక నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ చిత్రం, ఇంటెన్స్, ఎమోషన్, యాక్షన్, అద్భుతమైన విజువల్స్, లార్జర్ దెన్ లైఫ్ గా ఉండబోతోంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ చివరి దశలో వుంది. సహాయక తారాగణం, సాంకేతిక సిబ్బంది వివరాలను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.