Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chiru; నయనతారతో మీసాల పిల్ల అంటూ సాంగ్ వేసుకున్న చిరంజీవి

Advertiesment
Megastar Chiranjeevi, Nayanthara

చిత్రాసేన్

, శుక్రవారం, 3 అక్టోబరు 2025 (10:41 IST)
Megastar Chiranjeevi, Nayanthara
మెగాస్టార్ చిరంజీవి తన అప్ కమింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "మన శంకరవ ప్రసాద్ గారు" తో  ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్‌తో కలిసి గ్రాండ్ కాన్వాస్‌పై నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన గర్వంగా సమర్పిస్తున్నారు.
 
దసరా సందర్భంగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ 'మీసాల పిల్ల' ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ఆల్బమ్‌ని స్పెషల్ కాన్సెప్ట్ డిజైన్‌ చేశారు. ప్రతి పాటకీ మెగాఅన్న ప్రిఫిక్స్ జోడించి  మెగా గ్రేస్, మెగా స్వాగ్,  మెగా మాస్ అంటూ క్యురియాసిటీ క్రియేట్ చేశారు. ఈ ఐడియా ఫ్యాన్స్, మ్యూజిక్ లవర్స్‌ని  ఆకట్టుకుంది.
 
ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతి కి వస్తున్నాం ఆల్బమ్‌తో సంచలనం సృష్టించిన మ్యూజిక్ సెన్సేషన్ భీమ్స్ సిసిరోలియో, ఇప్పుడు మరోసారి పండుగ సందడి క్రియేట్ చేసే చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌తో రాబోతున్నారు.
 
ఈ ఉదయం రిలీజ్ చేసిన అనౌన్స్‌మెంట్ వీడియోలో అనిల్ రవిపూడి స్టైల్‌లోని సరదా టచ్, అలాగే లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ పాడిన ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లని పరిచయం చేశారు. వీడియోలోని క్విర్కీ ప్రెజెంటేషన్ నవ్వులు పంచి మ్యూజిక్ ఫీవర్‌కి స్టేజ్ రెడీ చేసింది.
 
మెగా గ్రేస్ ట్రాక్ ప్రోమోగా వచ్చిన మీసాల పిల్ల ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా, ఫస్ట్ బాల్ కే సిక్స్ కొట్టినట్లుగా ఉంది. నాస్టాల్జియా, మెలొడీ, యూనివర్సల్ అపీల్‌ని కలిపిన ఈ సాంగ్ అందరికీ నచ్చే హిట్ ట్యూన్ అవ్వడం ఖాయం.  
 
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.  ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేస్తున్నారు.
వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం  2026లో సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలోకి రానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Kantara Chapter-1 Review: కాంతార: చాప్టర్-1 చిత్రంతో రిషబ్ శెట్టి కు విజయం దక్కిందా.. కాంతార 1.రివ్యూ