Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వీట్ బేబీ డాటర్ డాల్.. నాతో ఒక రాత్రి గడుపుతావా?

Advertiesment
swamy sri chaitanyananda

ఠాగూర్

, శుక్రవారం, 3 అక్టోబరు 2025 (14:48 IST)
స్వీట్ బేబీ డాటర్ డాల్.. నాతో ఒక రాత్రి గడుపుతావా? అంటూ ఓ విద్యార్థినికి స్వామి చైతన్యానంద వాట్సాప్ సందేశం పంపించాడు. ఇలాగే అనేక మందికి ఆయన వాట్సాప్ సందేశాలు పంపించి లైంగికంగా వేధించినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అలాగే, దుబాయ్ షేక్ కోసం ఓ అమ్మాయిని కావాలంటూ ఓ మహిళకు ఆయన వాట్సాప్‌లో మెసేజ్ పంపించినట్టు తేలింది. 
 
విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టయిన స్వయం ప్రకటిత స్వామీజ చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. స్వామీజీకి నేరుగా సహకరించారన్న ఆరోపణలపై అతడి ముగ్గురు అత్యంత సన్నిహితురాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో శ్రీ శారదా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ రీసెర్స్‌కు చెందిన అసోసియేట్ డీన్ శ్వేతా శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ భావనా కపిల్, సీనియర్ ఫ్యాకల్టీ కాజల్ ఉన్నారు.
 
ఈ ముగ్గురూ పార్థసారథి ఆదేశాల మేరకే నడుచుకున్నట్లు విచారణలో అంగీకరించారని పోలీసు వర్గాలు తెలిపాయి. క్రమశిక్షణ, సమయపాలన పేరుతో విద్యార్థినులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి, స్వామీజీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నించారని వెల్లడించాయి. అంతేకాకుండా, బాధితులు ఫిర్యాదు చేయకుండా బెదిరించడం, నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలను నాశనం చేయడంలోనూ వీరి పాత్ర ఉందని పోలీసులు నిర్ధారించారు.
 
ఇటీవలే ఆగ్రాలో పట్టుబడిన 62 ఏళ్ల పార్థసారథి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఉపకారవేతనం పథకం కింద మేనేజిమెంట్ కోర్సుల్లో చేరిన 17 మందికి పైగా విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం, బలవంతంగా తాకడం, బెదిరింపులకు పాల్పడటం వంటి ఫిర్యాదులు అందాయి. దర్యాప్తులో భాగంగా ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఉన్న ఒక గెస్ట్‌హౌస్‌ను పోలీసులు పరిశీలించగా, అక్కడ పార్థసారథి విద్యార్థినులతో బస చేసినట్లు స్థానికులు ధ్రువీకరించారు.
 
నిందితుడి ఫోనులోని డిజిటల్ సాక్ష్యాలను కూడా పోలీసులు సేకరించారు. ఒక యోగా వాట్సాప్ గ్రూపులో విద్యార్థినుల ఫొటోలకు అతడు పెట్టిన అనుచిత వ్యాఖ్యలను గుర్తించారు. ఇన్ని ఆధారాలు దొరికినా, పార్థసారథిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదని విచారణ వర్గాలు పేర్కొన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్యార్థిని ప్రాణం తీసిన పెద్దనాన్న లైంగిక వేధింపులు