Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా పురుష చిత్రీకరణ పూర్తి

Advertiesment
Pawan Kalyan, Saptagiri and others

చిత్రాసేన్

, శుక్రవారం, 3 అక్టోబరు 2025 (11:43 IST)
Pawan Kalyan, Saptagiri and others
కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు పురుష అనే సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ అనే యువకుడు తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. వీరు ఉలవల దర్శకుడిగా పరిచయం కానున్నారు. వీరు ఉలవల ఇంతకు ముందు మళ్లీ రావా, జెర్సీ, మసూద చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసారు.
 
ఈ కామెడీ బేస్డ్ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. వెన్నెల కిషోర్, వి.టి.వి.గణేష్, అనంత శ్రీరామ్, పమ్మి సాయి, మిర్చి కిరణ్ వంటి కమెడియన్స్ అద్భుతమైన పాత్రల్ని పోషిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఈ మూవీలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తున్నారు. గబి రాక్, అనైరా గుప్తా కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఓ ప్రత్యేక గీతంతో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేశారు. చిత్రీకరణ ముగియడంతో యూనిట్ అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
 
కొత్త హీరో అయినప్పటికీ తన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడని యూనిట్ చెబుతోంది. నిర్మాతకు మొదటి ప్రాజెక్ట్ అయినప్పటికీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
త్వరలోనే అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసి రిలీజ్ డేట్‌‌ను ప్రకటించనున్నారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడుగా శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్‌గా కోటి, ఆర్ట్ డైరెక్టర్ గా రవిబాబు దొండపాటి పని చేస్తున్నారు.
 
 నటీనటులు : పవన్ కళ్యాణ్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు, శ్రీ సంధ్య, గబి రాక్, అనైరా గుప్తా, వెన్నెల కోషోర్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, పమ్మి సాయి, వి.టి.వి. గణేష్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం దసరా కు ముహూర్తం.. అక్టోబర్ 24న షూటింగ్