Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

Advertiesment
Comrade Kalyan is played by Sri Vishnu

చిత్రాసేన్

, శుక్రవారం, 3 అక్టోబరు 2025 (14:41 IST)
Comrade Kalyan is played by Sri Vishnu
శ్రీ విష్ణు తన వెర్సటైల్‌ పెర్ఫార్మెన్స్‌, యూనిక్ కథలతో అలరిస్తుంటారు. ప్రతి సినిమాలోనూ హ్యూమర్‌ వుండేలా చూసుకునే ఆయన తాజా ప్రాజెక్ట్‌ కూడా అదే రీతిలో ఎంటర్ టైన్మెంట్ అందించబోతున్నారు. కామ్రేడ్‌ కల్యాణ్‌ అనే టైటిల్‌తో వస్తున్న ఈ ఫన్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ ని వెంకట్‌ ప్రెజెంట్‌ చేస్తుండగా, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం హిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్‌ పిక్చర్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
 
టైటిల్‌ను పరిచయం చేస్తూ విడుదల చేసిన ప్రోమో ఆసక్తికరంగా ఉంది. 1992లో ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని విశాఖ జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథ, రేడియోలో నక్సలైట్‌ ముప్పు పెరుగుతోందని అనౌన్స్‌ చేసే సన్నివేశంతో మొదలవుతుంది. ప్రభుత్వం ఆందోళనలో ఉండగా, పోలీసులు, గ్రేహౌండ్స్‌ టీమ్‌ ఒక నక్సలైట్‌ లీడర్‌ ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’ను పట్టుకోవడానికి బయలుదేరతారు. కామ్రేడ్‌ కల్యాణ్‌ కోసం విడుదల చేసిన 5 లక్షల రివార్డ్‌ వాంటెడ్‌ పోస్టర్‌ను అతడే స్వయంగా అతికించడం ట్విస్ట్‌. చివరగా శ్రీ విష్ణు లుక్‌ రివీల్‌ అవుతూ ప్రోమో ఎంటర్టైనింగ్‌గా ముగుస్తుంది.
 
సీరియస్‌ ప్రీమైస్‌తో మొదలైన ఈ కథలో హ్యుమర్ ప్రధాన పాత్ర పోషించనుంది. యాక్షన్‌, పాలిటికల్‌ టెన్షన్‌, పోలీస్‌ క్రాక్‌డౌన్‌ మధ్య రొమాన్స్‌, కామెడీ సన్నివేశాలతో కలిపి ‘కామ్రేడ్‌ కల్యాణ్‌’ యాక్షన్‌-కామెడీ జానర్‌కు కొత్త టచ్‌ను ఇవ్వనుంది.
 
ఈ సినిమాలో శ్రీ విష్ణు డ్యుయల్‌ రోల్స్‌లో కనిపించనున్నారు. ఆయన లుక్‌ స్టైలిష్‌గా, ఇంట్రెస్టింగ్‌గా వుంది. హీరోయిన్‌గా మహిమా నంబియర్‌ నటిస్తుండగా, రాధికా శరత్‌కుమార్‌, షైన్‌ టామ్‌ చాకో, ఉపేంద్ర లిమయే కీలక పాత్రలు చేస్తున్నారు.
 
సాయి శ్రీరామ్‌ విజువల్స్‌ చిత్రానికి ప్రత్యేకతను తీసుకువస్తుంటే, విజయ్‌ బుల్గానిన్‌ అందిస్తున్న బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఎమోషన్, యాక్షన్ ని మరింత ఎలివేట్‌ చేస్తోంది. చోటా కె ప్రసాద్‌ ఎడిటర్, ప్రస్తుతం చిత్రీకరణ సగానికి చేరుకుంది, టీమ్‌ ఫుల్‌ స్పీడ్‌లో ముందుకు వెళ్తోంది.
 
తారాగణం: శ్రీ విష్ణు, మహిమా నంబియార్, రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..