Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మండాడి శరవేగంగా చిత్రీకరణ, విలన్ గా సుహాస్ స్పెషల్ పోస్టర్

Advertiesment
Suhas villan getup

దేవీ

, మంగళవారం, 19 ఆగస్టు 2025 (15:37 IST)
Suhas villan getup
సూరి, సుహాస్ నటిస్తున్న చిత్రం మందాడి.  ఈ ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఒక ల్యాండ్‌మార్క్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. శక్తివంతమైన ప్రదర్శనలు, గొప్ప విజువల్స్, భావోద్వేగభరితమైన కథనంతో ‘మండాడి’ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ నుండి 16వ ప్రాజెక్ట్‌గా ‘మండాడి’ హై-ఆక్టేన్ మూవీగా రాబోతోంది. ‘సెల్ఫీ’ ఫేమ్ మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్నారు.
 
హీరో సుహాస్ తన కెరీర్‌లో మొదటిసారిగా విలన్ పాత్రను పోషిస్తున్నారు. అతని పుట్టినరోజు సందర్భంగా ‘మండాడి’టీం శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రం కోసం సుహాస్ తన లుక్స్ మొత్తాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు, కొత్త లుక్ ఇప్పటికే దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బర్త్ డే విషెస్ చెబుతూ వదిలిన ఈ కొత్త పోస్టర్ కూడా అందరినీ మెప్పించేలా ఉంది.
 
సూరి, సుహాస్‌లతో పాటు మహిమా నంబియార్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన ప్రతిభావంతులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. క్రీడ నేపథ్యంలో  తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మనుగడ, వ్యక్తిగత గుర్తింపు, అజేయమైన మానవ స్ఫూర్తి వంటి అంశాలను ప్రధానంగా చూపించనున్నారు.
 
ఈ మూవీకి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎస్.ఆర్. కతిర్ ఐ.ఎస్.సి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. పీటర్ హెయిన్ తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. ఎడిటింగ్ ప్రదీప్ ఇ. రాఘవ్, ప్రొడక్షన్ డిజైన్ డి.ఆర్.కె. కిరణ్, వి.ఎఫ్.ఎక్స్ ఆర్. హరిహర సుతాన్ నిర్వహిస్తున్నారు. నిర్మాతలు త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
 
 తారాగణం : సూరి, సుహాస్, మహిమా నంబియార్, సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ ఫ్యామిలీలో విషాదం : జయకృష్ణ భార్య పద్మజ కన్నుమూత