సీనియర్ ఎన్టీఆర్ నివాసంలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ కుమారుల్లో ఒకరైన జయకృష్ణ సతీమణి పద్మజ అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న వారి నివాసంలో ఆమె తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వేంకటేశ్వర రావుకు స్వయంగా సోదరి. పద్మజ మరణవార్త తెలియగానే విజయవాడ నుంచి నందమూరి, దగ్గుబాటి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నగరానికి బయలుదేరి వెళ్లారు.
మరోవైపు, నందమూరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఫిల్మ్ నగర్‌లోని జయకృష్ణ నివానికి చేరుకుని పద్మజ భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఆమె మృతితో నందమూరి కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది.