Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Manoj: విజయ్‌సేతుపతిలా తెలుగులో సుహాస్‌ : మంచు మనోజ్‌

Advertiesment
Manchu Manoj with Oh Bhama Ayyo Rama team

దేవీ

, బుధవారం, 9 జులై 2025 (15:05 IST)
Manchu Manoj with Oh Bhama Ayyo Rama team
సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ అయ్యో రామ'. మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో   పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ బ్యానర్‌పై  హరీష్‌ నల్ల  ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్‌ రిలీజ్‌ కానుంది.  కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మంచు మనోజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో మంచు మనోజ్‌ బిగ్‌ టికెట్‌ను ఆవిష్కరించారు.
 
మనోజ్‌ మాట్లాడుతూ '' సుహాస్‌ ఎటువంటి నేపథ్యం లేకుండా హీరోగా ఎదిగాడు. నేపో కిడ్స్‌ అయినా సినిమా పరిశ్రమలో కష్టపడాల్సిందే. కష్టపడితేనే విజయం. నేను ఈ విషయాన్ని ఓ నెపో కిడ్‌గా చెబుతున్నా. యూట్యూబ్‌ నుంచి హీరోగా ఎదిగిన సుహాస్‌ జర్నీ ఎంతో ఇన్‌స్పిరేషన్‌. తమిళంలో విజయ్‌సేతుపతిలా తెలుగులో సుహాస్‌ కూడా అలాంటి స్టారే. అన్ని తరహా సినిమాలను చేస్తాడు. ఇండస్ట్రీలో సక్సెస్‌ కావడం కష్టమే. కాని కష్టపడితే సక్సెస్‌ సాధిస్తాం. ఈ సినిమా విజయం సాధించి నిర్మాతలకు, దర్శకుడికి బ్రేక్‌ నివ్వాలి. మంచి టీమ్‌తో రూపొందిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావాలి' అన్నారు. 
 
హీరో సుహాస్‌ మాట్లాడుతూ, అందరూ ఈ సినిమా చూసిన తరువాత మాళవిక ప్రేమలో పడిపోతారు. అలీ, అనిత, పృథ్వీ లాంటి సీనియర్ ఆర్టిస్ట్‌లతో నటించడం ఎంతో హ్యపీగా ఉంది. ప్రతి  అబ్బాయి సక్సెస్‌ఫుల్‌  లైఫ్‌లో తల్లి, భార్యలు ఇద్దరూ ఎంతో కీలకంగా ఉంటారు. ఈ పాత్రలకు సంబంధించిన ఎమోషన్స్‌ ఈ చిత్రంలో అందరి హృదయాలను హత్తుకుంటాయి. అందరి సపోర్ట్‌తో మంచి సినిమాలు చేస్తున్నారు. త్వరలో నా కెరీర్‌కు సంబంధించిన మరిన్ని బిగ్‌న్యూస్‌ తెలియజేస్తాను' అన్నారు. 
 
నిర్మాత హరీష్‌ నల్లా మాట్లాడుతూ ''  స్నేహితుడు ప్రదీప్‌ సహకారంతో  సుహాస్‌తో మా జర్నీ ప్రారంభమైంది. సుహాస్‌ కథ ఓకే చెప్పగానే సినిమా హిట్‌ అనుకున్నాను. మణికందన్‌ ఫోటోగ్రఫీ విజువల్స్‌ ఈ సినిమాలో ఎంతో రిచ్‌గా ఉంటాయి. బ్రహ్మా కడలి వేసిన సెట్స్‌  చూస్తుంటే నాకే ఆశ్చర్యమేసింది. ఇంత తక్కువ ఖర్చుతో ఇలాంటి సెట్స్‌ వేశాడా అనిపించింది. రథన్‌ సంగీతం ఈ సినిమాకు ఎంతో ప్లస్‌ అయ్యింది. ఈ సినిమాకు మాటీమ్‌ మల్టీటాస్క్‌లు చేశారు. దర్శకుడు మంచి టీమ్‌ను సెట్‌ చేసుకున్నాడు. ఈ చిత్రంలో సుహాస్‌ పర్‌ఫార్మెన్స్‌ మరో రేంజ్‌లో ఉంటుంది' అన్నారు. 
 
దర్శకుడు రామ్‌ గోధల మాట్లాడుతూ, మా  హీరోయిన్‌ స్టార్‌ హీరోయిన్‌గా మారిపోతుంది. ఈ సినిమా లైఫ్‌ టైమ్‌ మెమెరీ. ఈ సినిమా చేయడానికి కారణం సుహాస్‌. ఆయన కోసం ఎన్నో కథలు రాస్తాను. ఎన్నో సినిమాలు తీయలని ఉంది. స్వయం కృషితో ఎదిగిన హీరో సుహాస్‌కు తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ మంచి పేరుంది అన్నారు. 
 
కమెడియన్‌ అలీ మాట్లాడుతూ, ఈ సినిమాలో లవ్‌సీన్స్‌ ఎంతో ఎమోషనల్‌గా ఉంటాయి. ఈ సినిమా టీమ్‌ అంతా లవ్‌మ్యారేజే చేసుకున్నారు. మాళవిక సినిమాలో ఎంతో క్యూట్‌ గా ఉంది. ఈమెను చూస్తుంటే కెరీర్‌ మొదట్లో అనుష్కలా ఉంది  అన్నారు. ఈ సమావేశంలో చిత్రలహరి బ్యానర్‌ అధినేత, ఈ చిత్రం కో ప్రొడ్యూసర్‌ ప్రదీప్‌ తాళ్ళపు రెడ్డి, హీరోయిన్‌ మాళవిక, నటుడు శ్రీనాథ్‌, దర్శకుడు విజయ్‌ కనకమేడల, రామ్‌ జగదీష్‌, సంజనా రెడ్డి, సంగీత దర్శకుడు రథన్‌, రచయిత బీవీఎస్‌ రవి, మరో రచయిత డార్లింగ్‌ స్వామి, నటులు మెయిన్‌,  సాత్విక్‌, కెమెరామెన్‌ మణికందన్‌,   గీత రచయితలు రామ్‌ గోసాల, శ్రీ హర్ష ఈమని తదితరలు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

RK Sagar: ఆయన చనిపోయినప్పుడు చాలా పీలయ్యా : ఆర్.కె. సాగర్