Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుహాస్‌, మాళవిక మనోజ్ నటించిన ఓ భామ అయ్యో రామ ట్రైలర్‌

Advertiesment
Suhas, Malavika Manoj

దేవీ

, శనివారం, 5 జులై 2025 (14:49 IST)
Suhas, Malavika Manoj
ప్రేయసి పిలిస్తే శ్మశానంతో ధ్యానం చేయడం వంటి వింత సన్నివేశాలు, దర్శకుడు అవ్వాలనుకునే కుర్రాడి కథతో సుహాస్ కథానాయకుడిగా  నటించిన ఓ భామ అయ్యో రామ' నేడు ట్రైలర్‌ విడుదలైంంది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ అయ్యో రామ'. మలయాళం జో ఫేమ్ మాళవిక మనోజ్ కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్‌ రిలీజ్‌ కానుంది.
 
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ '' ట్రైలర్‌ విడుదలైన కొద్ది సమయంలోనే మంచి స్పందన వస్తోంది. ట్రైలర్‌ చూసిన వారు ఈచిత్రం షూర్‌ షాట్‌ విజయం అంటుంటే ఆనందంగా ఉంది. క్యూట్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తుంది. హీరో సుహాస్‌, మాళవిక మధ్య వచ్చే లవ్‌ సీన్స్‌ కూడా అలరించే విధంగా ఉంటాయి. సుహాస్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. తప్పకుండా ఈ చిత్రం అందరికి కొత్త అనుభూతినిస్తుంది. తప్పకుండా నిర్మాతగా ఓ మంచి సినిమాను ఇవ్వబోతున్నాం అనే నమ్మకం ఉంది అన్నారు. 
 
దర్శకుడు మాట్లాడుతూ, మణికందన్‌ ఫోటోగ్రఫీతో ఈ సినిమాను చాలా కలర్‌ఫుల్‌గా మలిచాడు.రథన్‌ ఈ లవ్‌స్టోరీకి చాలా మంచి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో ఉన్న ఆరుపాటలు వేటికవే అనే విధంగా బ్యూటిఫుల్‌గా ఉంటాయి అన్నారు.
 
ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్  అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. మణికందన్‌ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ చిత్రానికి రథన్‌ సంగీతాన్నిసమాకూరుస్తున్నాడు. బ్రహ్మా కడలి ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Varun Tej: వరుణ్ తేజ్ 15 వ చిత్రం విదేశాల్లో షూటింగ్