Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

Advertiesment
Sivaji, Sandeep Raj, Harsh Roshan, Bhanu, Jayateertha, Joseph Clinton, Suhas

దేవీ

, శనివారం, 28 జూన్ 2025 (19:54 IST)
Sivaji, Sandeep Raj, Harsh Roshan, Bhanu, Jayateertha, Joseph Clinton, Suhas
సందీప్ రాజ్‌ షో రన్నర్‌గా హర్ష రోషన్, భాను, జయతీర్థ ప్రధాన పాత్రల్లో  జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించిన వెబ్ సిరిస్ AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్. జూలై 3 నుంచి సిరీస్ ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోలు శివాజీ, సుహాస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.  
 
 హీరో శివాజీ మాట్లాడుతూ, చదువు అనేది నేచురల్ గా చదవాలి. కేవలం ర్యాంక్స్ కోసం చదవడం అనేది ఒక రకమైన హింస. ఈ సిరీస్ అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి. ఈటీవీ సమాజం పట్ల చాలా బాధ్యతగా ఉంటుంది. రామోజీరావు గారు తెలుగు జాతిలో పుట్టిన ఆణిముత్యం. వారి సంస్థ నుంచి వచ్చిన కథల్లో చాలా గొప్ప సందేశం ఉంటుంది. తెలుగులో మాట్లాడితే తెలుగు నటుడుకి ఆ కిక్కు వేరు. అందుకే అందరూ కూడా తెలుగులో స్క్రిప్ట్ రాసుకోవాలని కోరుకుంటున్నాను. తెలుగులో ఉండే మాధుర్యం వేరు. సినిమా అనేది ఎమోషన్. అది మాతృభాషలో రాసినప్పుడు ఇంకా అద్భుతంగా పండుతుంది. ఈటీవీ విన్ కొత్తరకంగా కథల్ని చెప్పాలని ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. అందరికీ థాంక్యు'అన్నారు,  
 
హీరో సుహాష్ మాట్లాడుతూ,  రోషన్ భాను .. మిషన్ ఇంపాజిబుల్ నుంచి తెలుసు. చాలా మంచి యాక్టర్స్. ఈ సిరీస్ కి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు సంజిత్. డిఓపి వర్క్ కూడా చాలా బాగుంది. డైరెక్టర్ జోసెఫ్ కి ఆల్ ది బెస్ట్.  ఇందులో పనిచేసిన అందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఈటీవీ నుంచి అద్భుతమైన కంటెంట్స్ వస్తున్నాయి.ఈ సిరీస్ కోసం నేను ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నాను. అందరికీ థాంక్యూ'అన్నారు.  
 
సందీప్ రాజ్ మాట్లాడుతూ..  ఈ ప్రాజెక్టు మీద దాదాపు ఏడాదిన్నర పాటు వర్క్ జరిగింది. జులై 3న  ఆల్ ఇండియా యాంకర్స్ రాబోతుంది. ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు'అన్నారు  
 
డైరెక్టర్ జోషేఫ్ మాట్లాడుతూ. .. నా స్క్రిప్ట్ విని నన్ను బిలీవ్ చేసిన సాయి గారు నితిన్ గారు సందీప్ గారికి థాంక్యూ. మీ అందరికీ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను.  కంటెంట్ కూడా మీరందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈటీవీ విండ్లో ఈటీవీ విన్లో జులై 3న తప్పకుండా చూడండి'అన్నారు.
 
చాందిని మాట్లాడుతూ..  శివాజీ గారికి సుహాస్ గారికి థాంక్యూ. సందీప్ గారికి ఈటీవీ విన్ యాజమాన్యానికి థాంక్యూ. నటీనటులు అందరూ చాలా అద్భుతంగా చేశారు. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా అందర్నీ అలరించేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.జూలై 3న తప్పకుండా అందరూ చూడండి'అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)