Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జాతకం


మేషం
మేషం : ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు సామాన్యం. మిత్రులను కలుసుకుంటారు. అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముందు చూపుతో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి.
రాశిచక్ర అంచనాలు

వృషభం
వృషభం : మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. ఏ వ్యక్తికి పూర్తి బాధ్యత అప్పగించడం మంచిదికాదు. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కోవలసి వస్తుంది. ధనం వ్యయం చేస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధికమిస్తారు. మీ సహకారంతో నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి.
రాశిచక్ర అంచనాలు

మిథునం
మిథునం : వృత్తులు, చిన్నతరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. ఉన్నతస్థాయి అధికారులు కింది స్థాయి సిబ్బందితో సౌమ్యంగా మెలగడం వల్ల క్షేమదాయకం. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఒకరికి సలహా ఇచ్చి మరొకరి ఆగ్రహానికి దూరమవుతారు.
రాశిచక్ర అంచనాలు

కర్కాటకం
కర్కాటకం : స్త్రీల అభిప్రాయాలకు స్పందన అంతంత మాత్రంగానే ఉంటుంది. మీ ఓర్పు, పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. విద్యార్థినుల్లో ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి నెలకొంటాయి. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు.
రాశిచక్ర అంచనాలు

సింహం
సింహం : మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ప్రముఖులతో పరిచయాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలతో పాటు శ్రమ, పనిభారం అధికం. స్త్రీలకు ఆరోగ్యంలో మెళకువ అవసరం. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోతాయి. ఆదాయ వ్యయాల్లో ఏకాగ్రత వహించండి.
రాశిచక్ర అంచనాలు

కన్య
కన్య : వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి అనుభవం గడిస్తారు. మీకు తెలియకుండానే దుబారా ఖర్చులు చేస్తారు. ప్రేమికుల వ్యవహారం పెద్దలకు సమస్యగా పరిణమిస్తుంది. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. విద్యార్థినులకు ఒత్తిడి, ఆందోళనలు అధికం. మీ అతిథి మర్యాదలు అందరినీ బాగా ఆకట్టుకుంటాయి.
రాశిచక్ర అంచనాలు

తుల
తుల : ఉద్యోగస్తులు ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఏదో ఒక తప్పిదం జరిగే ఆస్కారం ఉంది. పత్రికా సంస్థలోని వారికి యాజమాన్యం తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. స్త్రీల ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింతగా శ్రమించాలి. మిత్రులతో కలిసి ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేస్తారు.
రాశిచక్ర అంచనాలు

వృశ్చికం
వృశ్చికం : పట్టువిడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారం కాగలవు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీలకు విలాస వస్తువులు, అలంకారాల పట్ల మక్కువ పెరుగుతుంది. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. ప్రయత్నపూర్వకంగా మీ పనులు సానుకూలమవుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది.
రాశిచక్ర అంచనాలు

ధనస్సు
ధనస్సు : ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. కోర్టు వాదోపవాదాల్లో ఫ్లీడర్లకు చికాకులు తప్పవు. స్త్రీలకు నూతన పరిచయాలేర్పడతాయి. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. వ్యాపారాల్లో పోటీని తట్టుకోడంతో పాటు క్రమంగా స్థిరపడతారు. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత నెలకొంటుంది.
రాశిచక్ర అంచనాలు

మకరం
మకరం : ట్రాన్స్‌‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. భాగస్వామిక, సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలతో కలహములు, అన్ని కార్యముల యందు విఘ్నములు ఎదుర్కొంటారు.
రాశిచక్ర అంచనాలు

కుంభం
కుంభం : కాంట్రాక్టర్లకు రావలసిన ధనం అందటంతో ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. మిత్రులను కలుసుకుంటారు. మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపం దాల్చుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయ. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది.
రాశిచక్ర అంచనాలు

మీనం
మీనం : రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. స్త్రీల ఆరోగ్యంలో తగు జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయుల సూచనలతో విద్యార్థుల్లో మానసిక ధైర్యం నెలకొంటుంది. బ్యాంకుల నుంచి పెద్దమొత్తంలో ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపార లావాదేవీలకు అనుకూలం.
రాశిచక్ర అంచనాలు