సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు, పాటలకు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ చిత్రాన్ని జూలై11న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ '' ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్. అన్ని వర్గాలకు కావాలసిన అంశాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ అందర్ని అలరిస్తుంది. ఇదొక క్యూట్ అండ్ ఎంటర్టైనింగ్ లవ్‌స్టోరీలా సినిమాలోని ప్రతి ఫేమ్ కలర్ఫుల్గా ఉంది. సుహాస్ ఎంతో ఎనర్జీ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్. రామ్‌గా సుహాస్, సత్యభామగా మాళవిక మనోజ్‌లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతారు. హీరోయిన్ మాళవిక, హీరో సుహాస్ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో వినోదాన్ని పంచుతాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ సాధారణంగా లవ్ రొమాంటిక్ కామెడీ సినిమాలను అందరం ఇష్టపడుతుంటాము. ఇప్పుడు అదే తరహాలో సుహాస్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ఓ భామ అయ్యో రామ. అందరిని నవ్వించే వినోదమైన యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. తప్పకుండా ఈ చిత్రం సుహాస్ కెరీర్లో మైలురాయిగా నిలుస్తుంది. జూలై 11న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు థియేటర్లో ఎంజాయ్ చేస్తారు' అన్నారు.
నటీనటులు : సుహాస్, మాళవిక మనోజ్, అనిత హసానందిని, ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచి, మొయిన్, సాత్విక్ ఆనంద్, నయని పావని తదితరులు.