Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Ustad: ఉస్తాద్ కోసం పవన్ కళ్యాణ్, శ్రీలీల పై క్లాప్ కొట్టిన హరీశ్ శంకర్

Advertiesment
Harish Shankar,  Pawan Kalyan, Srileela

దేవీ

, బుధవారం, 11 జూన్ 2025 (15:35 IST)
Harish Shankar, Pawan Kalyan, Srileela
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్లో ఎంటర్ అయ్యారు. ఆయన కారు దిగి లొకేషన్ లోకి వెళ్ళగానే దర్శకుడు సీన్ గురించి వివరించారు. అది వినగానే పెద్దగా నవ్వుకుంటూ షాట్ రెడీ అనగానే, దర్శకుడు క్లాప్ కొట్టాడు. ఆ పక్కనే కుర్చీలో శ్రీలీల కూడా వుండడంతో ఇద్దరిపై ఓ డైలాగ్ ను షూట్ చేశారు. ఇక.ఓ.జి. సినిమా తర్వాత పవన్ చేస్తున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ సినిమాగా రూపొందుతోంది.
 
webdunia
Pawan Kalyan, Srileela
చిత్ర వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్‌ను వేగవంతం చేయడానికి పవన్ 45 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసుకోమని చెప్పినట్లు తెలిసింది. అందులో ప్రస్తుతం 25 రోజులు షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ చిత్రం తమిళ మాత్రుక అయినా దాన్ని హరీష్ శంకర్  పూర్తిగా కొత్త, మాస్ కథనాన్ని రూపొందించాడు. 
 
ఇందులో సాక్షి వైద్య మరో ముఖ్యమైన పాత్రలో కనిపిస్తుంది. హరీష్ శంకర్ సిగ్నేచర్ హై-వోల్టేజ్ రచనతో ఈ చిత్రం పవన్ అభిమానులను థ్రిల్ చేస్తుందని భావిస్తున్నారు. శ్రీలీల స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను నియమించడం గురించి కొన్ని ఊహాగానాలు ఉన్నాయి, కానీ చివరికి ఆ ఆలోచన విరమించుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం