Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Advertiesment
Malavika Manoj

దేవీ

, సోమవారం, 7 జులై 2025 (16:34 IST)
Malavika Manoj
సినిమా నేపథ్యంతో సంబంధం లేని ఫ్యామిలీ నాది. సినిమాల్లో నటించడం గర్వంగా ఉంది. ఇప్పుడు ట్రైలర్‌ చూసి మా ఫ్యామిలీ ఎంతో హ్యపీగా ఫీలయ్యారు. నేను తమిళంలో నటించిన చిత్రం 'జో'లో నా అభినయం చూసి దర్శకుడు రామ్‌ 'ఓ భామ అయ్యో రామ' చిత్రంలో హీరోయిన్‌గా సెలక్ట్‌ చేసుకున్నాడు. కథ వినగానే నాకు ఎంతో నచ్చింది అని మాళవిక మనోజ్‌ అన్నారు.
 
webdunia
Malavika Manoj
కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ అయ్యో రామ'. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్‌ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా కథానాయిక మాళవిక మనోజ్‌ సోమవారం పాత్రికేయులతో ముచ్చటించారు.
 
స్టోరీలో మీకు నచ్చిన అంశాలేమిటి? 
అది సింగిల్‌లైన్‌లో చెప్పలేను. చాలా డిఫరెంట్‌గా అనిపించింది. గతంలో నేను చేసిన సినిమాల్లో విలేజ్‌ సింపుల్‌ గర్ల్‌గా చేశాను. ఈసినిమలో నా పాత్ర ఎంతో మోడ్రరన్‌గా, హైపర్‌గా, అటిట్యూడ్‌తో ఉంటుంది. ప్రతి నటికి కావాలసిన వైవిధ్యమైన పాత్ర లభించింది. ఈ చిత్రంలో సత్యభామ అనే పాత్రలో కనిపించాను 
 
ఈ చిత్రంలో ఛాలెంజింగ్‌ అనిపించిన సన్నివేశం ఏమైనా? 
ఈ సినిమాలో  కోసం నాకు స్విమింగ్‌ రాకపోయినా.. ఓ సన్నివేశంలో షూటింగ్‌ వాయిదా పడటం ఇష్టం లేక నేను భయపడుతూనే స్విమింగ్‌ చేశాను. నాకు ఎంతో భయమేసినా సినిమా కోసం చేశాను.  ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. తెలుగు అర్థం అవుతుంది.. తమిళం నుంచి తెలుగులోకి డబ్‌ అయినా సినిమాలు చూస్తుంటాను. ఇటీవల తెలుగు హిట్‌-3 సినిమా చూశాను. 
 
చాలెంజింగ్‌ రోల్స్‌ ఏమైనా చేయాలని ఉందా? 
నాకు ఎప్పుడూ, డిఫరెంట్‌గా చాలెంజింగ్‌ పాత్రలు చేయాలని ఉంటుంది. ప్రతి సినిమాలో రొటిన్‌ పాత్రలు చేస్తే నాకే కాదు ఆడియన్స్‌కు కూడా బోర్‌ కొడుతుంది. నన్ను నేను ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రల్లో చూసుకోవడమే నాకు ఇష్టం. 
 
ఈ చిత్రంలో లవ్‌సీన్స్‌ కొత్తగా అనిపిస్తున్నాయి? 
 జనరల్‌గా అని సినిమాల్లో ఉండే ప్రేమ సన్నివేశాలే అయినా ఈ సినిమాలో లవ్‌సన్నివేశాల్లో ఫీల్‌ కొత్తగా ఉంటుంది. తప్పకుండా అందరూ ఎంజాయ్‌ చేస్తారు. ఎంటర్‌టైన్‌ అవుతారు. 
 
సినిమాల ఎంపిక విషయంలో మీరు పరిగణనలోకి తీసుకునే అంశాలు ఏమిటి? 
నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. నాకు నచ్చిన కథలతో మాత్రమే చేస్తున్నాను. నా కంఫర్ట్‌ జోన్‌లో సినిమాలు చేస్తున్నాను. నేను ఆ రోల్‌ ఫిట్‌ అనుకుంటేనే చేస్తున్నాను. మలయాళ ఫిల్మ్‌ ఫస్ట్‌ చేశాను. జో తమిళ చిత్రం 
 
గ్లామరస్‌ రోల్స్‌ చేస్తారా? 
గ్లామరస్‌ రోల్స్‌.. చేయాలా వద్దా? అనే నిబంధన నాకు లేదు. కథ నచ్చితే  నాకు కంఫర్టబుల్‌గా అనిపించిన రోల్స్‌ మాత్రమే చేశాను. నాకు నచ్చని పాత్రలు నేను చేయను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్