Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుహాస్‌, ఓ భామ అయ్యో రామ మూవీ రివ్యూ

Advertiesment
Oh Bhama Ayyo Rama

దేవీ

, శుక్రవారం, 11 జులై 2025 (16:00 IST)
Oh Bhama Ayyo Rama
కథానాయకుడు సుహాస్‌ నటించిన 'ఓ భామ అయ్యో రామ' నేడే విడుదలైంది. మాళవిక మనోజ్ (జో ఫేమ్) కథానాయికగా నటించింది.  రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ బ్యానర్‌పై  హరీష్‌ నల్ల  ఈ చిత్రాన్ని నిర్మించారు.  పూర్తి వినోదాత్మకంగా వుంటుందని చెప్పిన చిత్ర టీమ్ మాట నిజామా కాదా చూద్దాం.
 
కథ:  చిన్నతనంలోనే రామ్‌(సుహాస్‌) తల్లిని (అనిత) కోల్పోతాడు. ఆమె కూచిపూడి టీచర్. కులాంతరవివాహం చేసుకోవడంతో రామ్ తల్లిని తాత వెలివేస్తాడు. ఆ తర్వాత రామ్ మామయ్య(అలీ) పెంచుకుంటాడు. తన అమ్మ జయంతి సందర్భంగా రామ్ వరంగల్‌ వెళ్లి వస్తుంటాడు. అదే టైంలో బాగా తాగి కారును డ్రైవ్ చేస్తూ సత్యభామ (మాళవిక మనోజ్‌) స్పీడ్ గా వస్తూ రామ్ ను డాష్ ఇవ్వబోయి తప్పించడంతో చెట్టుకు గుద్దుకుంటుంది కారు. 
 
అనంతరం రామ్, మాళవికను వారింటిలో వదిలేస్తాడు. అలా పరిచయం ప్రేమవరకు దారితీస్తుంది. అయితే రామ్ కు సినిమాలంటే అసహ్యం. అలాంటివాడిని సినిమా డైరెక్టర్ చేయించేలా మాళవిక ప్రోత్సహిస్తుంది. అలా ఎందుకు చేసింది. ఆ తర్వాత ఏమయింది? అనేది మిగిలిన సినిమా. 
 
సమీక్ష:
సుహాస్ చిత్రాలంటే తనకంటూ ప్రత్యేక శైలి వుంటుంది. నాచురల్ గా కామన్ మేన్ గా నటించేస్తాడు. ఈ సినిమాలోనూ అదే జరిగింది. సత్యభామతో వచ్చే సన్నివేశాలు వినోదాన్ని సర్ ప్రైజ్ ఎలిమెంట్లు వుండేలా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు. అలీ, ప్రద్వీరాజ్ వంటి నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. 
 
కమర్షియల్ అంశాలతో పాటలు, సన్నివేశాలున్నాయి. అయితే మదర్‌ సెంటిమెంట్‌ని జోడించి కాస్త ఎమోషనల్‌ టచ్‌ చేశారు. మొదటి భాగం సరదాగా సాగుతున్నా కథేమిటో అర్థంకాకుండా ప్రేక్షకుడు కన్ ఫ్యూజ్ అయ్యేలా కథనాన్ని దర్శకుడు రాసుకున్నాడు. సెకండాఫ్ లో సాగు కథనంలో సెంటిమెంట్, ఎంటర్ టైన్ మెంట్ చూపించాడు. అందుకు సత్యభామ పాత్ర కీలకంగా తీసుకున్నాడు. తను సినిమా తీయడానికి పనికి వచ్చే కథలంటూ  కొన్ని కథలు చెబుతుంది. అదేవిధంగా స్నేహితురాలి పెండ్లి టైంలో కిడ్నాప్ చేయాలి అంటూ రామ్ స్నేహితులను పురామయించడం వంటివన్నీ ఎంటర్ టైన్ చేయిస్తాయి.
 
కాగా, అలాంటి ఎంటర్ టైన్ మెంట్ ను మొత్తంగా  చూపిస్తే బాగుండేది. మధ్య మధ్యలో కొన్ని ఉపకథలు పెట్టి కొంత గందరగోళంగా చూపించాడు. దానిపై ఇంకాస్త శ్రద్దపెడితే సినిమా మరోలా వుండేది. అమాయకంతో కూడిన పాత్రలో రామ్ లో ఇమిడిపోయాడు. చివర్లో ట్విస్ట్ ఒక సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తుంది. క్లైమాక్స్ లో తప్పుదోవ పట్టించేలా సన్నివేశాలు రాసుకుని అసలు విషయాన్ని రివీల్‌ చేసిన తీరు బాగుంది. 
 
సుహాస్‌ ఫ్రెండ్స్ సాత్విక్‌ నవ్వించారు. నయని పావనికి మంచి పాత్ర పడింది. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయని చెప్పొచ్చు. దర్శకులు హరీష్‌ శంకర్‌, మారుతి ఓ సన్నివేశంలో మెరుస్తారు. సినిమా టెక్నీకల్‌గా బాగా రిచ్‌గా ఉంది. చాలా క్వాలిటీగా ఉంది. మణికందన్‌ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. విజువల్స్ చాలా రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. బ్రహ్మకడలి తన మార్క్ ని చూపించారు. ఇక రథన్‌ మ్యూజిక్‌ సినిమాకి మరో ప్లస్‌. పాటలు బాగున్నాయి. టెక్నికల్ గా అన్నపూర్ణ స్టూడియోస్ పనులు పర్వాలేదు.
 
దర్శకుడు రామ్‌ గోధల కథను మరింత పట్టువుండేలా రాసుకుంటే బాగుండేది. పోలీస్ స్టేషన్ లో పర్సు మర్చిపోయిన రామ్ ఆ తర్వాత దాని గురించి పట్టించుకోకపోవడం అనే చిన్న అంశాన్ని దర్శకుడు వదిలేయడం బాగోలేదు. అక్కడక్కడా చిన్న లోపాటుబాగానే ఉంది. కాస్త రొటీన్‌గానే ఉన్నా, ఫర్వాలేదు. కానీ టేకింగ్‌ విషయంలో ఆయన మరింత బాగా చేయాల్సింది. ఫస్టాఫ్‌ని ఇంకా బాగా డీల్‌ చేయాల్సింది.
 కథకి ఎమోషన్స్, సోల్‌ ముఖ్యం. ఆ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. ఓవరాల్‌గా ఫర్వాలేదనిపించే చిత్రమిది.
రేటింగ్‌ః 2.75

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పరిమితమైతే బెటర్ : శృతిహాసన్