Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

Advertiesment
Suhas, Shivani Nagaram, Naresh

దేవీ

, సోమవారం, 18 ఆగస్టు 2025 (15:02 IST)
Suhas, Shivani Nagaram, Naresh
కథానాయకుడిగా సుహాస్ హిట్ కోసం ప్రయత్నాలుచేస్తున్నాడు. గత కొద్దికాలంగా ఆయన సినిమాలు జనరంజకం కావడంలేదు. మొదటిరోజుకే థియేటర్ల జనాలు లేకుండా పోతున్నారు. ఇటీవలే రెండు సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఫలితంలేకపోయింది. అందుకే ఇప్పుడు దేవుడ్ని వేడుకుంటున్నాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రానికి హే భగవాన్ అనే పేరు పెట్టాడు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ చేయమని కోరుకుంటున్నాడు.
 
నూతన దర్శకుడు గోపి అచ్చర దర్శకత్వంలో నటిస్తున్నారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు,  రైటర్ పద్మభూషణ్‌ ఫేం షణ్ముక ప్రశాంత్ ఈ కథను రాశారు. సుహాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను లాంచ్ చేసి ఫన్ ని డబుల్ చేశారు. ఈ చిత్రానికి హే భగవాన్! అనే టైటిల్‌ పెట్టారు.
 
ఒక టీమ్ వీడియో బయటికి వస్తే ఫ్యామిలీ సీక్రెట్ బిజినెస్ బయటపడిపోతుందని నరేష్ పిఎ హెచ్చరించే సన్నివేశంతో టైటిల్ టీజర్ ప్రారంభమవుతుంది. సుహాస్ స్టైలిష్ ఎంట్రీ ఆకట్టుకుంది. సుహాస్, శివానీ నగరం మధ్య  సీక్రెట్ ఫ్యామిలీ బిజినెస్ పై జరిగే ఓ ఆర్గ్యుమెంట్ హిలేరియస్ గా వుంది. డైరెక్టర్ గోపీ అచ్చర టీజర్‌ని స్మార్ట్‌గా కట్ చేశారు. మిస్టరీ బయటపెట్టకుండా, సిట్యుయేషన్స్‌, క్యారెక్టర్స్‌తోనే లాఫ్స్ జనరేట్ చేశారు. హీరోయిన్‌గా శివాని నాగరం గ్లామరస్‌గా కనిపించింది. సుహాస్ ఫాదర్‌గా నటించిన సీనియర్ నరేశ్ తన నేచురల్ కామెడీతో ఆకట్టుకున్నాడు. సుదర్శన్ కూడా తన కామెడీతో ఎంటర్టైన్మెంట్ డబుల్ చేశాడు.
 
హీరో సుహాస్ మాట్లాడుతూ.. హే భగవాన్ షూటింగు మంచి ఫ్లోలో స్టార్ట్ అయింది. ఈ సినిమాలో సుదర్శన్ నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. మా ఇద్దరి కాంబినేషన్ చాలా అద్భుతంగా వచ్చింది. తనకి ఈ సినిమాతో చాలా మంచి పేరు వస్తుందని నమ్మకం ఉంది. శివానితో వర్క్ చేయడం రెండోసారి. సినిమాలో మరింత మంచి పేరు వస్తుంది.. ప్రశాంత్ ఈ సినిమాకి అద్భుతమైన కథ ఇచ్చాడు. డైరెక్టర్ గోపి అన్న కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్ కి కూడా పనిచేశారు. ఈ సినిమాతో తను డైరెక్టర్ గా డెబ్యు అవుతున్నారు. కచ్చితంగా మంచి హిట్ కొడతాం. నా ఫేవరెట్ నరేష్ గారితో పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది అన్నారు.
 
హీరోయిన్ శివాని మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.  సుహాస్ గారితో నాకు ఇది సెకండ్ ఫిల్మ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్యూ సో మచ్. సుహాస్ చాలా న్యూ లుక్ లో కనిపిస్తున్నారు. నరేష్ గారితో వర్క్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది.  
 
డాక్టర్ నరేష్ వి కె మాట్లాడుతూ, హే భగవాన్ ఈ టైటిల్ ఎందుకు పెట్టామో మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.  కథ విన్నప్పుడు పగలబడి నవ్వాను. చాలా కొత్త బ్యాక్ డ్రాప్ తీసుకున్నారు. ఈ గ్లిమ్స్ చూడగానే నాకు మరింత ఎక్సైట్మెంట్ వచ్చింది. సుహాస్ తెలుగు సినిమా ప్రైడ్.  తను 50 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో పూర్తి చేసుకుంటాడని నమ్మకంగా చెబుతున్నాను. డైరెక్టర్ గోపికి చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. నిర్మాత నరేందర్ రెడ్డి గారికి అద్భుతమైన విజయాలు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్