తాను తీవ్రమైన ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తానని ప్రముఖ హీరోయిన్ సంయుక్తా మీనన్ వెల్లడించారు. తాను మద్యం సేవించే అలవాటు ఉందని ఆమె బహిరంగంగా చెప్పడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. అయితే, తాను రోజు మద్యం తీసుకోనని, కేవలం తీవ్రమైన ఒత్తిడి లేదా ఆందోళనగా అనిపించిన సందర్భాల్లో మాత్రమే కొద్దిగా తీసుకుంటానని ఆమె స్పష్టం చేశారు. మానసిక ప్రశాంతత కోసం అపుడపుడూ ఇలా చేస్తానని సంయుక్తా మీనన్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు మాత్రం తమకు తోచినవిధంగా కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, హీరో పవన్ కళ్యాణ్ సరసన "భీమ్లా నాయక్" చిత్రంలో నటించిన సంయుక్తా మీనన్... ఆ తర్వాత హీరో ధనుష్ సరసన "సార్" చిత్రంలో నటించారు. అలాగే, విరూపాక్ష సినిమాలో కూడా నటించారు. బాలకృష్ణ సరసన "అఖండ-2" సినిమాలో ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. 'స్వయంభు', 'నారి నారి నడుమ మురారి', పూరి జగన్నాథ్ - విజయ్ సేతుపతి చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాలు షూటింగులో ఉన్నాయి.