సినీ హీరోయిన్లు రాధిక, నిరోషల తల్లి గీత రాధ ఇకలేరు. ఆమెకు వయసు 86 యేళ్ళు. వృద్దాప్యంతో ఆదివారం రాత్రి 9.30 గంటలకు చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లోని ఆమె స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్టు నటి రాధిక విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొమన్నారు.
తమిళ చిత్రసీమలో తన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేసిన దివంగత నటుడు ఎంఆర్ రాధ సతీమణి. తన జీవితాన్ని కుటుంబానికే అంకితం చేశారు. గీతకు నలుగురు పిల్లలు. వీరిలో ఇద్దరు కుమార్తెలు రాధిక, నిరోష కాగా, ఇద్దరు కుమారులు రాజు రాధ, మోహన్ రాధలు ఉన్నారు.
కాగా, గీత అంత్యక్రియలు సోమవారం సాయంత్రం స్థానిక బీసెంట్ నగర్‌లోని విద్యుత్ దహనవాటికలో నిర్వహించనున్నారు. గీత రాధ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు. సినీ నటుడు శరత్ కుమార్‌కు అత్త కూడా.