Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Naresh: అమ్మ కోప్పడితే చనిపోవాలనుకున్నా: నరేశ్; అమ్మకు అబద్దాలు చెప్పేదాన్ని : వాసుకీ

Advertiesment
Naresh, Vasuki

దేవీ

, మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (14:50 IST)
Naresh, Vasuki
తల్లిదండ్రులు, పిల్లల మధ్య అంతరాలు చాలా పెరిగిపోతున్నాయి. ఒకప్పటి జనరేషన్ కీ ఇప్పటికీ చాలా తేడా వుంది. అయితే అప్పటికీ ఇప్పటికీ మార్పులేనిది ఏమన్నా వుందంటే పిల్లలు నిజాలు చెప్పకపోవడమే అంటూ సీనియర్ నటులు నరేశ్, వాసుకీ తెలియజేశారు. వారిద్దరూ భార్యభర్తలుగా బ్యూటీ అనే సినిమాలో నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా కథ గురించి చెబుతూ తామూ కథలోని పాత్రలకూ కనెక్ట్ అయ్యామని వివరించారు.
 
వాసుకీ మాట్లాడుతూ, నాకూ కుమార్తె వుంది. తను ఇంగ్లండ్ లో మెడిసిన్ చదువుతోంది. ఈ సినిమా ప్రివ్యూకు తీసుకువచ్చి చూపించాను. చాలా కనెక్ట్ అయింది. ఇప్పటి జనరేషన్ కు తగినట్లుగా వుందని కితాబిచ్చింది. సహజంగా మన పిల్లలు మనకు అన్నీ నిజాలు చెబుతారనుకోవడం చాలా తప్పు. అందులో అబద్దాలు కూడా వుంటాయి. పెండ్లి కాకముందు మా అమ్మ నా గురించి పలు జాగ్రత్తలు చెబుతుండేది. తేలిగ్గా తీసుకోవడమేకాదు విసుక్కునే దానిని. అప్పుడూ కొన్ని అబద్దాలు కూడా చెప్పాను. జనరేషన్ మారినా ఇప్పటి పిల్లలు చెప్పేదానిలో 90 శాతం అబద్దాలే వుంటుంది. ఇవి సినిమా చూస్తే ఎవరికి వారు కనెక్ట్ అవుతారు అని తెలిపింది.
 
సీనియర్ నరేష్ మాట్లాడుతూ, మా అమ్మగారు చిన్నతనంలో ఓ సందర్భంగా గట్టిగా తిట్టారు. దానితో బాగా కోపంతో ఆవేశంతో చనిపోదామని సైకిల్ తీసుకుని చాలా దూరంగా వెళ్ళాను. కానీ సాయంత్రానికి బాగా ఆకలేసింది. బయట ఎవరు భోజనం పెడతారు. దేవుడా.. అంటూ తిరిగి వెనక్కివచ్చా. అది తెలిశాక అమ్మ చంప చెళ్లుమనిపించింది. ఆ దెబ్బలే నా ఎదుగుదలకు దోహదపడ్డాయి. అయితే ఇప్పటి జనరేషన్ ను కొట్టడం కాదు. కనీసం మందలించినా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేపువారు పెద్దయ్యాక వారి పిల్లలు చేసే చేష్టలకు వారిలో పరివర్తన వస్తుందో చూడాలి. పిల్లలు, పెద్దలు అనేది జీవితంలో సైకిల్ లాంటిది అని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Priyanka: పవన్ కళ్యాణ్ ఎప్పుడూ టెన్షన్ పడేవారు : ప్రియాంక అరుళ్మోహన్