శొంఠి పాలు ఆరోగ్యకరమే, కానీ ఎక్కువ తాగితే ఏమవుతుందో తెలుసా?

శొంఠి ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో వుంది. కావల్సినంత మోతాదులో శొంఠిని పాలులో లేదా గోరువెచ్చని మంచినీటిలో వేసుకుని తాగితే పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అవేమిటో తెలుసుకుందాము.

credit: Freepik and webdunia

శొంఠి పాలు జీర్ణక్రియకు చాలా మేలు చేస్తాయి. అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

శొంఠిలో శోథ నిరోధక గుణాలు పుష్కలం. శొంఠి పాలను తాగడం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, మైగ్రేన్ తలనొప్పి వంటివి తగ్గుతాయి.

శొంఠి పాలకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఉపశమనం కలిగించే శక్తి వుంది.

శొంఠి పాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు ఒక మంచి ఔషధంలా పనిచేస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

శొంఠి రక్తాన్ని పలచబరచడంలో సహాయపడుతుంది, తద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రణలో ఉంచుతుంది.

శొంఠి పాలు గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడతాయి

శొంఠి పాలు క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఇది ఆకలి పెరిగి బరువును అదుపులో వుంటుంది,

గమనిక: శొంఠి పాలను ఎక్కువగా తాగడం వల్ల గుండెల్లో మంట, అతిసారం వంటి సమస్యలు రావొచ్చు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, శొంఠి పాలు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ఎముకపుష్టికి ఎండు ఖర్జూరం పాలు

Follow Us on :-