Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలిక గొంతుకోసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు...

Advertiesment
murder case

ఠాగూర్

, బుధవారం, 1 అక్టోబరు 2025 (14:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని సామర్లకోట మండలం పనసపాడులో ఓ యువకుడు 17 యేళ్ల బాలిక గొంతు కోసి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. గొల్లప్రోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, అశోక్ అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 
 
మంగళవారం అర్థరాత్రి పనసపాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్దకు బాలికను అశోక్ తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుకానీ.. బ్లేడుతో ఆ బాలిక గొంతుకోసి హతమార్చాడు. ఆ తర్వాత తాను కూడా రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాదన్నపేటలో వృద్ధురాలిపై దాడి చేయించిన కానిస్టేబుల్