తనను ఏదో శక్తి రమ్మని పిలుస్తుందని పేర్కొంటూ ఓ బ్యాంకు మేనేజరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ఘటన హన్మకొండ జిల్లాలో జరిగింది. ఈ జిల్లాలోని రాంనగర్‌కు చెందిన బర్ల సురేందర్ (36) అనే వ్యక్తి బ్యాంకు మేనేజరుగా పని చేస్తూ హైదరాబాద్ నగరంలోని రామంతపూర్‌లో భార్యాపిల్లలతో కలిసి జీవిస్తున్నారు.
అయితే, ఆయన తాజాగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. తనను ఏదో శక్తి పిలుస్తోందని వెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై క్షుద్రపూజలు జరిగాయని అనుమానంతో మంత్రగాళ్ళను ఆయన కలిశారు. ఆ తర్వాత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో బాధపడ్డాడు. ఈ క్రమంలో ఆయన తాజాగా ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.