Priyadarshi, Niharika NM and team
ప్రియదర్శి, నిహారిక ఎన్ఎమ్, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా నటించిన చిత్రం మిత్ర మండలి. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మించారు. వెన్నెల కిషోర్, సత్య, వి.టి.వి. గణేష్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. టీజర్, కట్టండుకో జానకి, స్వేచా స్టాండు, జంబర్ గింబర్ లాలా వంటి పాటలతో మిత్ర మండలిపై పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఈ చిత్ర బృందం విజయవాడ ఉత్సవ్ ఈవెంట్‌లో సందడి చేసింది.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ* .. తెలుగు సినిమా గుండె విజయవాడలో కొట్టుకుంటుందని మా పరిశ్రమలోని వ్యక్తులు ఎల్లప్పుడూ చెబుతారు. అక్టోబర్ 16న రానున్న మిత్ర మండలి థియేటర్లలో కుటుంబం మొత్తంతో ఆస్వాదించగల క్లీన్ ఎంటర్‌టైనర్ అని అన్నారు.
హీరోయిన్ నిహారిక ఎన్ఎమ్ మాట్లాడుతూ, ఈ రోజు ఇలా మీ అందరితో ఇక్కడ ఉండటం నాకు ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిత్ర మండలి పక్కా కామెడీ చిత్రం. కాబట్టి దయచేసి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి అని అన్నారు.
ప్రెజెంటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ.. మేము లిటిల్ హార్ట్స్ తో ఎంతగా అయితే నవ్వించామో ఈ మిత్ర మండలి తోనూ అంతే స్థాయిలో ఖచ్చితంగా నవ్విస్తాము. ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకే ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమా చూసి మీరు నవ్వి నవ్వి కడుపునొప్పితో థియేటర్ నుంచి బయటకు వెళ్తారు అని అన్నారు.
నిర్మాత భాను ప్రతాప మాట్లాడుతూ.. మా ఈ కార్యక్రమానికి విచ్చేసిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు. మా మిత్ర మండలి బృందంతో ఈ ఉత్సవ్‌లో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అక్టోబర్ 16న అందరినీ నవ్వించేందుకు మేం థియేటర్లోకి వస్తున్నామని అన్నారు.
సంగీత దర్శకుడు ఆర్.ఆర్. ధ్రువన్ మాట్లాడుతూ* .. నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఈ మూవీలోని ప్రతీ పాటను శ్రోతలు చార్ట్ బస్టర్‌లుగా మార్చారు. ఈ మూవీతో అందరికీ తప్పకుండా వినోదం లభిస్తుంది. అక్టోబర్ 16న మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని అన్నారు.
నటుడు ప్రసాద్ బెహరా మాట్లాడుతూ* .. మా మీద ఇంత ప్రేమను కురిపిస్తున్న విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు. అక్టోబర్ 16న మా మిత్ర మండలితో అందరినీ నవ్విస్తామని హామీ ఇస్తున్నాం అని అన్నారు.
నటుడు విష్ణు ఓఐ మాట్లాడుతూ, ఈ చిత్రం చివరి వరకు మిమ్మల్ని నవ్విస్తుంది. లిటిల్ హార్ట్స్ కంటే ఎక్కువగా ఈ చిత్రం అందరినీ నవ్విస్తుంది. ప్రియదర్శి ఎప్పుడూ ఓ డిఫరెంట్ కంటెంట్‌లను ఎంచుకుంటూ ఉంటారు. ఈ అక్టోబర్ 16న సినిమాను ఆస్వాదించండి అని అన్నారు.