దసరా ఉత్సవాల్లో భాగంగా దశమి తిథి అక్టోబర్ 1 సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానుంది. ఈ తిథి అక్టోబర్ 2వ తేదీ రాత్రి 07.10 గంటలకు ముగియనుంది. ఈ తిథి ప్రకారం దసరా వేడుకలు అక్టోబర్ రెండో తేదీన జరుపుకుంటారు. ఆయుధ పూజను అక్టోబర్ 2న జరుపుకోవడం విశేషం. అదీ మధ్యాహ్నం 2.09 నుంచి 02.56 వరకు ఈ పూజను నిర్వహిస్తారు.
పురాతన కాలంలో రాజులు, యోధులు ఆశ్వయుజ మాసం దశమి రోజున ఆయుధాలను పూజిస్తారు. అలాగే విజయదశమి నాడు విజయ ముహూర్తంలో ఆయుధ పూజ చేయడం వల్ల శుభం కలుగుతుంది.
ఈ పూజ జీవితంలో విజయానికి దోహదపడుతుంది. దసరా పండుగ రోజు అక్టోబర్ 2న ఈ పూజ చేస్తారు. విజయ దశమి రోజునే శ్రీరాముడు రావణుడిని సంహరించి లంకను జయించాడని పురాణాలు చెప్తున్నాయి.
ఇదే రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి ప్రపంచాన్ని రాక్షస బాధల నుంచి విడిపించిందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజున అమ్మవారి విజయ రూపాన్ని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది.