తన భర్త నుంచి విడాకులు కోరిన ఓ భార్య, తన భర్త పరాయి మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడనే అనుమానం కలిగినట్లయితే అతడి లొకేషన్ కాల్ రికార్డును తెలుసుకునే హక్కు ఆమెకి వున్నదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. తన భర్త తరచూ ఓ మహిళతో తిరగడంపై ఓ భార్య వేసిన పిటీషన్ విచారిస్తూ ఈమేరకు తీర్పునిచ్చింది.
వివాహేతర సంబంధం ఆరోపణలను నిర్ధారించేందుకు, ఆరోపించబడిన భర్త మరియు అతడి ప్రియురాలి మొబైల్ లొకేషన్ రికార్డులను కోరవచ్చని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అయితే బాధితురాలి న్యాయమైన తీర్పు హక్కు, జీవిత భాగస్వామి- అతడి ప్రియురాలి గోప్యతా ప్రయోజనాల మధ్య సమతుల్యతను సాధించాల్సి వుంటుందని తెలిపింది.
బాధితురాలి భర్తతో పాటు అతడి ప్రియురాలి యొక్క మొబైల్ ఫోన్‌ల టవర్ లొకేషన్‌తో సహా CDRలను అవసరాన్ని బట్టి కోర్టు కోరవచ్చని పేర్కొంది. భార్య తన భర్త వివాహేతర సంబంధం ఆరోపణను నిరూపించగలదని ఆమె సహేతుకంగా విశ్వసించే సాక్ష్యాలను మాత్రమే కోరడానికి ఇది సుళువు చేస్తుందని తెలియజేసింది.