Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

Advertiesment
breast cancer awareness

ఐవీఆర్

, శనివారం, 27 సెప్టెంబరు 2025 (22:25 IST)
క్రికెట్ యొక్క భారీ పరిధిని వినియోగించుకోవటం ద్వారా అర్థవంతమైన సామాజిక మార్పును తీసుకురావటానికి, భారతదేశంలో అత్యంత విశ్వసనీయ జీవిత బీమా సంస్థలలో ఒకటైన ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) థాంక్స్ ఎ డాట్ కార్యక్రమం ద్వారా రొమ్ము క్యాన్సర్ అవగాహనను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లడానికి కలిసి వచ్చాయి. ఈ ప్రయత్నంలో భాగంగా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్(ఒడిఐ) మ్యాచ్ సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టు థాంక్స్-ఎ-డాట్ లోగోతో అలంకరించబడిన విలక్షణమైన గులాబీ రంగు జెర్సీలలో మైదానంలోకి దిగింది. ఈ కార్యక్రమం, మహిళల ఆరోగ్య ప్రాధాన్యతను వెల్లడించటానికి క్రీడ యొక్క ఏకీకరణ శక్తిని ఎలా ఉపయోగించవచ్చో వెల్లడించింది, రొమ్ము క్యాన్సర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కీలకమైన దశలుగా రొమ్ము స్వీయ-పరీక్ష, ముందస్తు గుర్తింపు యొక్క ప్రాముఖ్యత గురించి సంభాషణలను ప్రోత్సహిస్తుంది.
 
మ్యాచ్‌కు ముందు, ప్రత్యేకంగా నిర్వహించిన ప్రీ-మ్యాచ్ వేడుకలో ఎస్‌బిఐ లైఫ్ ప్రెసిడెంట్-సీడీఓ శ్రీ ఎం.ఆనంద్, ఎస్‌బిఐ లైఫ్ బ్రాండ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, సీఎస్ఆర్ చీఫ్ శ్రీ రవీంద్ర శర్మ, నటి మరియు రొమ్ము క్యాన్సర్ బాధితురాలు శ్రీమతి మహిమా చౌదరి సమక్షంలో భారత మహిళా జట్టు కెప్టెన్, క్రీడాకారిణులు- హర్మన్‌ప్రీత్ కౌర్, ప్రతీకా రావల్, స్నేహ రానాకు ప్రత్యేకంగా రూపొందించిన టీమ్ ఇండియా థాంక్స్-ఎ-డాట్ పింక్ జెర్సీని అందజేశారు. వీటిని మ్యాచ్ సమయంలో ఆటగాళ్ళు ధరించారు, ఇది మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడంలో లోతైన నిబద్ధతను సూచిస్తుంది.
 
ఈ కార్యక్రమం గురించి ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ అధ్యక్షుడు- చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ శ్రీ ఎం. ఆనంద్ మాట్లాడుతూ, ఎస్‌బిఐ లైఫ్‌ వద్ద, మేము ప్రాణాలను మాత్రమే కాకుండా కలలు, ఆకాంక్షలను కూడా రక్షించడంను నమ్ముతాము. థాంక్స్-ఎ-డాట్ అనేది రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచడానికి, ప్రాణాలను కాపాడగల జ్ఞానంతో మహిళలకు సాధికారత కల్పించడానికి చేస్తోన్న మా హృదయపూర్వక ప్రయత్నం. బిసిసిఐ, థాంక్స్-ఎ-డాట్ పింక్ జెర్సీలను ధరించిన భారత మహిళా క్రికెట్ జట్టు మద్దతును పొందటం మేము గౌరవంగా భావిస్తున్నాము, ఇది ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచ వేదికపై రొమ్ము క్యాన్సర్ పట్ల అవగాహనను విస్తృతం చేస్తుంది. ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ కలిసి భారతదేశం, వెలుపల లక్షలాది మంది మహిళలు రొమ్ము ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి, చర్యలు తీసుకోవడానికి ప్రేరేపించడంలో సహాయపడగలవని మేము ఆశిస్తున్నాము అని అన్నారు. 
 
ఆయనే మాట్లాడుతూ, భారతదేశంలో, రొమ్ము క్యాన్సర్ ఒక క్లిష్టమైన ఆరోగ్య సవాలుగా నిలుస్తోంది, చాలా కేసులు ఆలస్యంగా గుర్తించబడుతున్నాయి. ఈ క్యాన్సర్ నివారణలో అవగాహన, ముందస్తు గుర్తింపు అత్యంత కీలకమైనవి. ఈ కార్యక్రమం ద్వారా, వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో జీవించడానికి, వారి ఆకాంక్షలను కొనసాగించడానికి వీలు కల్పించడానికి, వారి ప్రియమైనవారి భవిష్యత్తును కాపాడుకోవడానికి, ఆర్థిక సంసిద్ధతను నిర్ధారించుకోవడానికి వీలు కల్పించడం ఎస్‌బిఐ లైఫ్ లక్ష్యంగా పెట్టుకుంది. వ్యక్తులు, కుటుంబాలు తమ జీవితాలను ప్లాన్ చేసుకోవడంలో సహాయం చేస్తూ ఎస్‌బిఐ లైఫ్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మహిళలు, కుటుంబాలకు జ్ఞానాన్ని అందించడం, సకాలంలో చర్య తీసుకోవడాన్ని ప్రోత్సహించడం, రొమ్ము క్యాన్సర్ గురించి లివింగ్ రూమ్ సంభాషణలను సాధారణీకరించడం ద్వారా ఆలోచనా విధానంలో అర్థవంతమైన మార్పును సృష్టించాలని మేము ఆశిస్తున్నాము. ఆర్థిక ప్రణాళికతో ముందస్తు వ్యాధి గుర్తింపును కలపడం ద్వారా, సమాచారం, చురుకైన ఎంపికలు జీవితాలను కాపాడగలవని, భవిష్యత్తును ఆశతో ఎదుర్కోవడానికి విశ్వాసాన్ని బలోపేతం చేయగలవని మేము పునరుద్ఘాటిస్తున్నాము అని ఆయన అన్నారు.
 
నటి- క్యాన్సర్ సర్వైవర్ మహిమా చౌదరి మాట్లాడుతూ, ఎస్‌బిఐ లైఫ్ యొక్క థాంక్స్ ఎ డాట్ కార్యక్రమంతో భాగస్వామ్యం చేసుకోవటం నాకు ఎంతో అర్థవంతమైనది, ఎందుకంటే ఇది విద్యాపరంగా రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహనను వ్యాపింపజేస్తుంది. నా వరకూ నేను ఈ పోరాటంలో పాల్గొన్న తర్వాత, ముందస్తు గుర్తింపు కీలకమని నాకు అర్ధమైంది. హగ్ ఆఫ్ లైఫ్ అనేది మహిళలు ప్రతి నెలా రొమ్ము స్వీయ-పరీక్షను అభ్యసించడానికి ఒక జ్ఞాపికగా పనిచేస్తుంది అని అన్నారు. 
 
2019లో ప్రారంభించబడిన ఎస్‌బిఐ లైఫ్ యొక్క రొమ్ము క్యాన్సర్ అవగాహన కార్యక్రమం, థాంక్స్ ఎ డాట్(టిఏడి), భారతీయ మహిళలకు విద్య, శిక్షణ, రొమ్ము స్వీయ పరీక్ష, ముందస్తు గుర్తింపు, ఆర్థిక సంసిద్ధత యొక్క ప్రాముఖ్యత గురించి గుర్తు చేయడం ద్వారా వారితో అనుబంధం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ముందస్తు గుర్తింపును ప్రోత్సహించే లక్ష్యాన్ని కొనసాగిస్తూ, ఎస్‌బిఐ లైఫ్ యొక్క థాంక్స్ ఎ డాట్ అక్టోబర్ 2023లో ప్రాజెక్ట్ హగ్ ఆఫ్ లైఫ్‌ను ప్రారంభించింది. దీనిలో క్యాన్సర్ గడ్డలను పోలిన 3D గడ్డలను మహిళలు ఋతుక్రమ నొప్పి సమయంలో ఉపశమనం కోసం విస్తృతంగా ఉపయోగించే  వేడి నీటి సంచిపై చెక్కారు. ఇది శిక్షణ ఇవ్వడం, మహిళలు క్రమం తప్పకుండా రొమ్ము స్వీయ పరీక్షలు చేయమని గుర్తు చేయడం, అవగాహనను ప్రోత్సహించడం, అర్థవంతమైన ప్రవర్తనా మార్పును నడిపించడం కూడా ఒక ప్రత్యేకమైనదిగా చేస్తుంది.
 
బిసిసిఐ యొక్క హృదయపూర్వక మద్దతుతో విస్తృత దృశ్యమానత, అభిమానుల అనుసంధానతను మరింత నిర్ధారించడానికి, ఎస్‌బిఐ లైఫ్ మ్యాచ్ సమయంలో బహుళ టచ్‌పాయింట్‌లలో థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంను ఏకీకృతం చేసింది. డాట్ బాల్ కౌంటర్‌ను టిఏడి హగ్ ఆఫ్ లైఫ్ బ్యాగ్‌గా తిరిగి రూపొందించారు. ఇండియా vs ఆసీస్ వన్డేలో ప్రతి 50 డాట్ బాల్స్‌కు, 200 మంది వెనుకబడిన మహిళలకు థాంక్స్-ఎ-డాట్ కిట్ ద్వారా సాధికారత కల్పించబడుతుంది, రొమ్ము స్వీయ-పరీక్షపై మార్గనిర్దేశం చేయబడుతుంది. ఈ కిట్‌ల పంపిణీకి ప్రధాన్ ఎన్జీఓ మద్దతు ఇస్తుంది.
 
పిచ్ మ్యాట్‌లో టిఏడి లోగో ఉంది, అవగాహన సందేశాన్ని చర్య యొక్క కేంద్రంలో ఉంచుతుంది. సంవత్సరం పొడవునా, ఎస్‌బిఐ లైఫ్ సంభాషణను కొనసాగించడానికి, మహిళలు చురుకైన అలవాట్లను అవలంబించడానికి, రొమ్ము ఆరోగ్యం వైపు శాశ్వత ప్రవర్తనా మార్పును పెంపొందించడానికి పలు కార్యక్రమాలను కొనసాగిస్తుంది. స్వీయ-రొమ్ము పరీక్ష, ముందస్తు గుర్తింపు యొక్క ప్రాణాలను రక్షించే సందేశంతో క్రికెట్ అభిరుచిని కలపడం ద్వారా, ఎస్‌బిఐ లైఫ్ యొక్క థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమం రొమ్ము ఆరోగ్యం చుట్టూ అర్థవంతమైన సంభాషణలను రేకెత్తించడం, సకాలంలో స్వీయ-తనిఖీలను ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్య చర్చలు సంకోచం నుండి చర్యకు మారాలని, వ్యక్తులు తమను తాము మాత్రమే కాకుండా వారి ప్రియమైన వారిని కూడా రక్షించే సరళమైనప్పటికీ శక్తివంతమైన చర్యలు తీసుకోవడానికి ప్రోత్సహించాలని ఈ కార్యక్రమం నొక్కి చెబుతుంది. అప్నే లియే, అప్నో కే లియే అనే బ్రాండ్ తత్వశాస్త్రానికి కట్టుబడి, ఎస్‌బిఐ లైఫ్ రక్షణ, శ్రేయస్సు సంస్కృతిని పెంపొందించడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది, ఇక్కడ అవగాహన , చురుకైన చర్య భవిష్యత్తును విశ్వాసం, బలం, ఆశతో ఎదుర్కోవడానికి కుటుంబాలకు శక్తినిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం