Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణవ్యాప్తంగా బీమాను మరింత అందుబాటులోకి తెచ్చిన ఎస్‌బీఐ లైఫ్

Advertiesment
SBI Life  Telangana branch

దేవీ

, శుక్రవారం, 9 మే 2025 (18:28 IST)
SBI Life Telangana branch
తెలంగాణ: భారతదేశపు అత్యంత విశ్వసనీయ ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, తెలంగాణలో కొత్త బ్రాంచ్ ఆఫీస్ ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలోని వినియోగదారులకు బీమాను మరింత అందుబాటులోకి తెచ్చింది. కేవలం జీవితాలకే కాకుండా జీవనోపాధులకు కూడా భద్రత కల్పించే అవసర-ఆధారిత బీమా పథకాలతో అందరికీ సాధికారత కల్పించాలన్న కంపెనీ చిత్తశుద్ధికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. 
 
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మెయిన్‌రోడ్ ఓల్డ్ సెంటర్‌లోని రాజబాపయ్యగారి వీధి పక్కన D.No. 7-120/2, ఫస్ట్ ఫ్లోర్‌లో కొత్త శాఖ ఏర్పాటు చేయబడింది. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తెలంగాణ రీజనల్ డైరెక్టర్ Mr. అభిషేక్ కర్ మజుందార్ ఈ శాఖను ప్రారంభించారు. ఆర్ఎం ఏజెన్సీ Mr. పి. వంశీధర్ రెడ్డి; DRM-TS2 Mr. రవీందర్ ఎప్పా (Ravinder Eppa), ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
“2047 నాటికి అందరికీ బీమా” కల్పించాలన్న భారత బీమా రంగ నియంత్రణ మరియు అభివృద్ధి ప్రాధికార సంస్థ (IRDAI) లక్ష్య సాధనకు ఈ వ్యూహాత్మక విస్తరణ తోడ్పడనుంది. అర్బన్, సెమీ-అర్బన్ ప్రాంతాల్లోనూ భౌతికంగా శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా బీమా భద్రతపరమైన అంతరాలను తగ్గించడం, వివిధ వర్గాల్లో ఆర్థిక సన్నద్ధత మరియు రిస్కులను అధిగమించే సామర్థ్యాలను పెంపొందించాలనేది ఎస్‌బీఐ లైఫ్ లక్ష్యం.
 
ఎస్‌బీఐ లైఫ్‌కి తెలంగాణవ్యాప్తంగా 54 శాఖల విస్తృతమైన నెట్‌వర్క్‌ ఉంది. ప్రతి కస్టమరుకు నిరాటంకమైన, విశ్వసనీయమైన అనుభూతిని అందించేలా, కొత్తగా ఏర్పాటు చేసిన శాఖలో పాలసీల జారీ మరియు సర్వీసింగ్, ప్రీమియం రెన్యువల్స్, క్లెయిమ్స్ కోసం ప్రత్యేక సపోర్ట్ సహా పూర్తి సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 
 
వ్యక్తులు, కుటుంబాలు సురక్షితంగా, ఆత్మవిశ్వాసంతో జీవించడంలో తోడ్పాటు అందించాలన్న లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ ఎస్‌బీఐ లైఫ్, వృద్ధి బాటలో పురోగమిస్తోంది. ప్రియమైన వారి అవసరాలు, ఆకాంక్షలకు భద్రత కల్పిస్తూ, తమ కలలను సాకారం చేసుకునేలా ప్రజలకు సాధికారత కల్పిస్తోంది. ఈ విస్తరణనేది భౌగోళికపరమైన మైలురాయి మాత్రమే కాకుండా, జీవితంలో కీలక సమయాల్లో విశ్వసనీయ భాగస్వామిగా ఎస్‌బీఐ లైఫ్ పోషించే పాత్రను కూడా పునరుద్ఘాటిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...