భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పేరును ట్రేడ్‌మార్క్ చేసుకోవాలన్న యత్నాలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనక్కి తగ్గంది. తమ సంస్థలో ఓ జూనియర్ ఉద్యోగి పర్మిషన్ తీసుకోకుండానే ఈ దరఖాస్తును దాఖలు చేశాడంటూ స్పష్టం చేసింది. రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆపరేషన్ సిందూర్ ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
ఈ క్రమంలోనే తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ అనే పేరును లేదా దాన్ని పోలి ఉండే టైటిల్స్‌ను రిజిస్టర్ చేసుకునేందుకు 30కి అప్లికేషన్లు వచ్చాయి. దీనికి దరఖాస్తు చేసిన వాటిలో జాన్ అబ్రహం, ఆదిత్య ధర్ వంటి ప్రముఖ నిర్మాతలు కూడా ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా దీనికి అప్లై చేసినట్లు వార్తలు రావడంతో తాజాగా ఆ సంస్థ దీనిపై క్లారిటీ ఇచ్చింది. తాము ఈ దరఖాస్తును ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేసింది.
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు పలు ప్రధాన నగరాల్లో బుధవారం అలజడి రేగింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన ప్రతీకార చర్యల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ సైరన్లు మోగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇదే సమయంలో పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతుండటం గమనార్హం.