Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఎపుడంటే?

Advertiesment
inter board

ఠాగూర్

, శుక్రవారం, 3 అక్టోబరు 2025 (19:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది. షెడ్యూల్‌లో భాగంగా, ఇంటర్ పరీక్షలు వచ్చే యేడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని ఇంటర్ బోర్డు శుక్రవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
ఫిబ్రవరి 23 నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 24 నుంచి ద్వితీయ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపింది. జనరల్‌ కోర్సులకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు, ఒకేషనల్‌ కోర్సులకు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు రెండు సెషన్లలో ఉంటాయని తెలిపింది.
 
ప్రాక్టికల్‌ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు (ఆదివారాల్లో సహా) రెండో సెషన్‌ ఉంటాయని తెలిపింది. అయితే, ఇది తాత్కాలిక షెడ్యూల్‌ మాత్రమేనని.. పండుగల్లో సెలవుల దృష్ట్యా అవసరమైతే ఈ షెడ్యూల్‌లో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి డా.నారాయణ భరత్‌ గుప్తా తెలిపారు. పూర్తి టైం టేబుల్‌ని ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిందూర్ 2.0 జరిగితే ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్‌ను లేపేస్తాం : భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్