Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిందూర్ 2.0 జరిగితే ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్‌ను లేపేస్తాం : భారత ఆర్మీ చీఫ్ వార్నింగ్

Advertiesment
upendra dwivedi

ఠాగూర్

, శుక్రవారం, 3 అక్టోబరు 2025 (19:22 IST)
ఆపరేషన్ సిందూర్ 2.0 జరిగితే ప్రపంచపటం నుంచి పాకిస్థాన్‌ను లేపేస్తామని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది గట్టి హెచ్చరికలు చేశారు. సీమాంతర ఉగ్రవాన్ని అరికట్టకపోతే పాకిస్థాన్‌ను ప్రపంచ చిత్రపటంలోనే లేకుండా చేస్తామని ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు. దేవుడు అనుమతి ఉంటే అలాంటి అవకాశం త్వరలోనే లభిస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని అనప్‌గఢ్‌లో ఉన్న ఆర్మీ పోస్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన భారత సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈసారి తాము గతంలోలా సంయమనం పాటించబోమని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ 1.0లో ఉన్నట్టుగాకాకుండా, ఆపరేషన్ సిందూర్ 2.0లో పాకిస్థాన్ మరింత తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 
 
భవిష్యత్‌లో తాము తీసుకునే చర్యలు పాకిస్థాన్ తన ఉనికి గురించి ఆలోచించేలా చేస్తామని జనరల్ ద్వివేది వ్యాఖ్యానించారు. భూమిపై ఉండాలనుకుంటే పాకిస్థాన్ తక్షణమే సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలని ఆయన గట్టిగా చెప్పారు. ఈ సందర్భంగా సైనికులు ఎలాంటి పరిస్థితులకైనా సర్వసన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

World Animal Day 2025: ప్రపంచ జంతు దినోత్సవం.. ఈ సంవత్సరం థీమ్‌ ఏంటి.. కొత్త జీవుల సంగతేంటి?