విజయ్ దేవరకొండ, సాయిధరమ్ తేజ్‌లకి ఇంటిపోరు

శనివారం, 8 జూన్ 2019 (18:55 IST)
అన్నలకు ఉన్న క్రేజ్‌తో తమ్ముళ్ళు వచ్చేస్తున్నారు. బ్రదర్స్ అంటే మెగా బ్రదర్స్ కాదు. మెగా తమ్ముళ్ళు వచ్చి చాలా కాలమైంది. యంగ్ హీరోల పేర్లు చెప్పుకుని ఇద్దరు సినిమా ఎంట్రీ ఇస్తున్నారు. విజయ్ దేవరకొండ రాకతో యంగ్ హీరోలకు సరికొత్త క్రేజ్ వచ్చిందనే చెప్పాలి. యూత్‌లో మంచి ఇమేజ్ ఉన్న విజయ్ దేవరకొండకు వుంది. ఇప్పుడు అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని మూవీతో వెండితెరపైకి వస్తున్నాడు. దొరసాని మూవీ టీజర్ చూస్తుంటే మేడలో రాజకుమారి.. తోటలో రాముడు కథ గుర్తుకొస్తుంది.
 
దొరసానిగా రాజశేఖర్ కూతురు శివాత్మిక ఎంట్రీ ఇవ్వగా కెవిఆర్ దర్సకత్వంలో సురేష్ బాబు, మధురా శ్రీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో మెగా హీరోల సంఖ్య చాలా పెద్దదే. పదకొండవ మెగా యాక్టర్‌గా వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్ తమ్ముడే వైష్ణవ్. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మేకర్స్ నిర్మిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం సాయిపల్లవి పట్టిందల్లా ఫ్లాపే... ఎందుకలా?