Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత్ వన్డే జట్టు తదుపరి కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ : ఆకాశ్ చోప్రా

Advertiesment
shreyaas ayyar

ఠాగూర్

, సోమవారం, 25 ఆగస్టు 2025 (16:06 IST)
భారత క్రికెట్ జట్టు తదుపరి జట్టు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌కు దక్కవచ్చని ప్రఖ్యాత వ్యాఖ్యాత, టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ, ఆ వార్తల్లో నిజం లేదని, రోహిత్ శర్మ తర్వాత ఆ బాధ్యతలను శుభమన్ గిల్ చేపట్టడం దాదాపు ఖాయమైపోయిందని ఆయన స్పష్టం చేశాడు. ఈ విషయంపై ఇప్పటికే ఓ నిర్ణయం జరిగిపోయిందని, అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని అభిప్రాయపడ్డాడు.
 
తన యూట్యూబ్ ఛానల్ అభిమానులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. "టీమిండియా తదుపరి వన్డే కెప్టెన్ ఎవరనేది మంచి ప్రశ్న. శ్రేయాస్ అయ్యర్ పేరు బలంగా వినిపిస్తోంది. కానీ, నా అభిప్రాయం ప్రకారం, తర్వాతి కెప్టెన్ శుభమన్ గిల్ అని ఇప్పటికే నిర్ణయమైపోయింది. అతడిని టెస్ట్ కెప్టెన్‌గా, ఆసియా కప్‌కు టీ20 వైస్ కెప్టెన్‌గా నియమించడమే దీనికి నిదర్శనం" అని చోప్రా వివరించాడు. 
 
ఇప్పటికే గిల్ వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా ఉన్నాడని, కాబట్టి ఈ విషయంలో మరో ఆలోచనకు తావులేదని ఆయన పేర్కొన్నాడు. "గిల్ ఇప్పటికే టెస్ట్ కెప్టెన్. టీ20లకు వైస్ కెప్టెన్. అతను వన్డే వైస్ కెప్టెన్ కూడా. కాబట్టి మరో ప్రశ్న అడగకండి. తర్వాతి కెప్టెన్ శుభమన్ గిల్‌లే" అని చోప్రా తేల్చి చెప్పాడు. 
 
అదేసమయంలో, శ్రేయస్ అయ్యర్, శుభమన్ గిల్ కెప్టెన్సీ సామర్థ్యాలను పోలుస్తూ ఇద్దరూ అద్భుతమైన నాయకులేనని చోప్రా ప్రశంసించాడు. "శ్రేయస్ అద్భుతంగా రాణించాడు. కేకేఆర్‌కు టైటిల్ అందించాడు. కానీ గిల్ రికార్డు కూడా తక్కువేం కాదు. గుజరాత్‌ను ప్లే ఆఫ్స్‌కు తీసుకెళ్లాడు. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లు డ్రా చేశాడు. ముందుండి నడిపించే నాయకుడు అతను. తన ప్రదర్శనతోనే జట్టుకు ఆదర్శంగా నిలుస్తాడు" అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Cricketer: వున్నట్టుండి కారు తలుపులు తెరిచాడు.. బైకుపై వెళ్తున్న క్రికెటర్ మృతి (video)