Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

Advertiesment
cough

సిహెచ్

, శనివారం, 30 ఆగస్టు 2025 (23:55 IST)
కన్సల్టెంట్ ఫిజీషియన్ల యొక్క ప్రొఫెషనల్ బాడీ అయిన అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర స్టేట్ చాప్టర్ (ఏపీఐ ఎంఎస్సీ), గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ సహకారంతో ఆగస్టు 29ను జాతీయ దగ్గు దినోత్సవంగా ప్రకటించింది. దగ్గుపై దేశ వ్యాప్తంగా అవగాహన సృష్టించడం, రోగులు- ఆరోగ్య సంరక్షణ నిపుణులలో ఙ్ఞానం పెంచడం, రుజువుతో కూడిన రోగ నిర్ధారణ, చికిత్సా పద్ధతులను ప్రోత్సహించడం ఈ మొదటి ప్రయత్నం యొక్క లక్ష్యం.
 
భారతదేశంలో పల్మనాలజీని అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన అమూల్యమైన కృషిని గుర్తు చేసుకుంటూ శ్వాస సంబంధిత ఆరోగ్య సంరక్షణలో గొప్ప మార్గదర్శకుడు, ఇండియన్ చెస్ట్ సొసైటీ ఫౌండర్ డాక్టర్ అశోక్ మహాసూర్ గారి వర్ధంతి అయిన ఈ రోజును ఎంచుకోవడం జరిగింది. యూరోపియన్ రెస్పిరేటరీ జర్నల్ ప్రకారం, భారతదేశంలో దాదాపు 30 శాతం మంది రోగులు దగ్గును రెండవ అత్యంత సాధారణ లక్షణంగా పేర్కొన్నారు. కానీ, తగిన వైద్యపరమైన మార్గదర్శకాలు లేకపోవడం వల్ల తప్పుగా నిర్ధారణ చేయడం, తగిన చికిత్స లేకపోవడం వంటివి జరుగుతున్నాయి. జాతీయ దగ్గు దినోత్సవాన్ని ప్రవేశపెట్టడం ద్వారా, ఆరోగ్య సంరక్షణ నిపుణులలో రుజువుతో కూడిన పద్ధతులను ప్రోత్సహించి, ఇంకా రోగి ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం ద్వారా ఈ క్లిష్టమైన సమస్యను పరిష్కరించాలని ఎపిఐ-ఎంఎస్సి లక్ష్యంగా పెట్టుకుంది.
 
అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా- ఎంఎస్సీ గౌరవ సంయుక్త కార్యదర్శి డాక్టర్ అగమ్ వోరా మాట్లాడుతూ, చాలాకాలంగా, దగ్గు తక్కువ ఇబ్బంది ఉండే ఆరోగ్య సమస్యగా పరిగణించబడుతుంది, తరచుగా శాస్త్రీయంగా కాకుండా ఏదైనా వ్యాధికి లక్షణంగా చికిత్స పొందుతుంది. జాతీయ దగ్గు దినోత్సవం ద్వారా, భారతదేశంలో దగ్గు నిర్వహణలో క్లిష్టమైన సమస్యను పరిష్కరించడం, రుజువుతో కూడిన మార్గదర్శకాలతో వైద్యులను సిద్ధం చేయడం, లక్షణాలను బట్టి వివిధ దగ్గు రకాలను ముందుగానే గుర్తించడానికి, నిర్ధారించడానికి వీలు కల్పించడం, మెరుగైన వైద్యపరమైన ఫలితాలను నిర్ధారించడానికి CDSCO-ఆమోదించిన ఎఫ్డిసిలతో చికిత్స ప్రారంభించడం ఈ ప్రయత్నంలో ఉంటుంది. డాక్టర్ అశోక్ మహాసూర్ గారు సేవలను స్మరించుకోవడం ద్వారా, దేశంలో శ్వాస ఆరోగ్య సంరక్షణను అభివృద్ధి చేయాలనే ఆయన ఆశయాన్ని కూడా మనం పాటించాల్సి ఉంటుంది.
 
అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా- ఎంఎస్సీ, సలహాదారు, కన్సల్టెంట్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ మంగేష్ తివాస్కర్ గారు మాట్లాడుతూ, జాతీయ దగ్గు దినోత్సవం అనేది ఒక ముందుచూపు ప్రయత్నం, ఇది దగ్గు నిర్వహణను ఎలా ఎదుర్కోవాలో పునరాలోచించుకోవడానికి వైద్యులతో సహా భాగస్వాములందరినీ కలిపి ఏకం చేస్తుంది. భారతదేశం యొక్క మొట్టమొదటి రుజువుతో కూడిన మార్గదర్శకాలను ప్రారంభించడంతో, మనం ఒక ప్రామాణిక డయాగ్నోసిస్, చికిత్సా పద్ధతులకు ఒక బెంచ్మార్క్‌ను సెట్ చేస్తున్నాము. ఇది మిలియన్ల మంది రోగులకు మంచి మెరుగైన జీవన నాణ్యతకు ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము.
 
వైద్యులు, రోగులు, రిటైలర్లు, సంరక్షకులతో పాటు ఈ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలోని అందరూ భాగస్వాములను ఒకే తాటిపైకి చేర్చడం ద్వారా దగ్గు వంటి తరచుగా తక్కువ ప్రమేయం ఉన్న సమస్యకు ప్రాముఖ్యతను తీసుకురావడానికి జాతీయ దగ్గు దినోత్సవం రూపొందించబడింది. దేశవ్యాప్తంగా దగ్గు సంబంధిత పరిస్థితులను బాగా అర్థం చేసుకోవడం, దానికి చికిత్స నిర్వహించడంపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్