Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

Advertiesment
Dulquer Salmaan - Kanta

దేవీ

, సోమవారం, 28 జులై 2025 (17:52 IST)
Dulquer Salmaan - Kanta
దుల్కర్ సల్మాన్ మోస్ట్ అవైటెడ్  పీరియాడికల్ మూవీ కాంత ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్లతో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తుండగా, దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది.

స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజును పురస్కరించుకుని, నిర్మాతలు ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు, ఈ టీజర్ ప్రాజెక్ట్ పై అంచనాలను మరింత పెంచింది
 
వెర్సటైల్ యాక్టర్  చంద్రన్, వెటరన్ రైటర్-డైరెక్టర్ అయ్య కెరీర్ ఆరంభంలో ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయత, క్రమంగా పేరు, ప్రఖ్యాతి వ‌చ్చేకొద్దీ చీలిపోయింది. అయ్య తన మొదటి హర్రర్ చిత్రం శాంతను శక్తివంతమైన కథానాయిక చుట్టూ రూపొందిస్తారు. స్టార్ అయిన చంద్రన్ క్రమంగా ఆ ప్రాజెక్ట్‌ను తన చేతుల్లోకి తీసుకుంటాడు. అతను తన ఇమేజ్‌కు అనుగుణంగా స్క్రిప్ట్‌ను మార్చి.. అలాగే  టైటిల్‌ను కూడా కాంతగా మార్చేస్తాడు.  
 
1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే ఈ థ్రిల్లర్‌ ఎమోషనల్ ఇంటెన్సిటీతో కట్టిపడేసింది. సెట్స్‌, కాస్ట్యూమ్స్ అన్నీ అప్పటి కాలంను గుర్తు తెస్తాయి. డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్ కథను అద్భుతంగా డిజైన్  చేశాడు.
 
దుల్కర్ సల్మాన్ తన కమాండింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నారు. సముద్రఖని ఒక వెటరన్ ఫిల్మ్ మేకర్ గా ఒదిగిపోయారు. భాగ్యశ్రీ బోర్సే తనదైన ముద్ర వేసింది.
 
డాని సాంచెజ్ లోపెజ్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ, 1950ల వాతావరణాన్ని అందంగా రిక్రియేట్ చేస్తే..  తా. రామలింగం ఆర్ట్ డైరెక్షన్ విజువల్ గ్రాండియర్ ని మరింత పెంచింది.  ఝాను చంథర్ సంగీతం ఇంటెన్సిటీని  ఎలివేట్ చేసింది. తమిళ్ ప్రభ అదనపు స్క్రీన్‌ప్లే అందించారు. లెవెలిన్ ఆంథోనీ గోన్సాల్వ్స్ ఎడిటింగ్ ఎంగేజింగ్ గా వుంది.
టీజర్ హ్యుజ్ బజ్‌ను క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రాబోతున్న కాంతపై అంచనాలను పెంచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు