Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Advertiesment
Beckem Venugopal, Jagadish Amanchi, Sravani Shetty, Priyanka, Mallika

దేవీ

, సోమవారం, 28 జులై 2025 (15:11 IST)
Beckem Venugopal, Jagadish Amanchi, Sravani Shetty, Priyanka, Mallika
మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్‌గా ‘యముడు’ అనే చిత్రాన్ని జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు 'ధర్మో రక్షతి రక్షితః' అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదలయ్యాయి. తాజాగా యముడు ఆడియోలాంచ్ ఈవెంట్‌ సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు.
 
ఈ కార్యక్రమంలో మొదటి పాటను ప్రియాంక, మల్లిక లాంచ్ చేశారు. రెండో పాటను బెక్కెం వేణుగోపాల్ గారు రిలీజ్ చేశారు. మూడో  పాటను కే మ్యూజిక్ సీఈవో ప్రియాంక గారు, యముడు నాలుగో పాటను మల్లిక గారు రిలీజ్ చేశారు.
 
అనంతరం బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, ప్రతీ ఏడాది వందల చిత్రాలు వస్తుంటాయి. అందులో కొంత మందికి మాత్రమే సక్సెస్ వస్తుంది. చిన్న చిత్రాలు ఈ మధ్య వండర్లు క్రియేట్ చేస్తున్నాయి. చిన్న ప్రయత్నాలే పెద్ద విజయాల్ని సాధిస్తున్నాయి. అలా ఈ ‘యముడు’ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. జగదీష్ ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా మారి ‘యముడు’ సినిమాను తీశారు. మొదటి చిత్రాన్నే ఇంత ప్రయోగాత్మాకంగా తీయడం గొప్ప విషయం. భవానీ ఇచ్చిన సంగీతం బాగుంది అని అన్నారు.
 
హీరో, దర్శకుడు జగదీష్ ఆమంచి మాట్లాడుతూ,  ప్రస్తుతం ఎక్కడ చూసినా కుట్రలు, హత్యలు, అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఆ పాయింట్‌లతోనే ఈ చిత్రాన్ని తీశాం. అందరినీ ఆకట్టుకునేలా మా చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
 
శ్రీ మల్లిక మాట్లాడుతూ .. ‘మా ‘యముడు’ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. చాలా డిఫరెంట్ కథతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. మా మూవీని అందరూ చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నాను’ అని అన్నారు.
 
శ్రావణి శెట్టి మాట్లాడుతూ, మన జీవితంలో జరిగే ఘటనల్నే, చేసే తప్పుల్నే ఇందులో చూపించబోతోన్నారు. అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ చిత్రం ఉంటుంది. శివ మంచి స్క్రీన్ ప్లేని రాశారు. జగదీష్ ప్రాణం పెట్టి ఈ చిత్రాన్ని చేశారు అని అన్నారు.
 
ఆకాష్ మాట్లాడుతూ .. ‘జగదీష్ గారు ఈ చిత్రానికి మెయిన్ పిల్లర్. ఈ మూవీ అద్భుతంగా వచ్చింది. నా ఈ ప్రయాణంలో శివ ఎప్పుడూ అండగా నిలిచారు. భవానీ రాకేష్ అందించిన పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. నన్ను సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్’ అని అన్నారు.
 
భవానీ రాకేష్ మాట్లాడుతూ .. ‘మా ‘యముడు’ సినిమాకు అవకాశం ఇచ్చిన జగదీష్ గారికి థాంక్స్. ఈ ప్రయాణంలో శివ నాతో మూడేళ్లుగా ప్రయాణిస్తూనే ఉన్నారు. నాకు సపోర్ట్ చేసిన టీం అందరికీ థాంక్స్. ఈ మూవీలోని పాటలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి’ అని అన్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ