Dr. Naresh Vk, Darling Krishna, Manisha
డార్లింగ్ కృష్ణ, మనీషా హీరో హీరోయిన్స్ గా శశాంక్ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ లింగ్వల్ మూవీ 'బ్రాట్'. డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మంజునాథ్ కంద్కూర్ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి యుద్ధమే రాని సాంగ్ ని రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటని డాక్టర్ నరేష్ వికే లాంచ్ చేశారు. అర్జున్ జన్య సంగీతం అందించిన ఈ పాటకు సనారె లిరిక్స్ రాశారు. ఈ బ్యూటీఫుల్ లవ్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది.
డాక్టర్ నరేష్ వికే మాట్లాడుతూ, ఈ సినిమా ఐదు భాషల్లో చిత్రీకరించి విడుదల చేస్తున్నారు. శశాంక్ చాలా ట్యాలెంటెడ్ డైరెక్టర్. మనిషా అద్భుతమైన నటి. మ్యూజికల్ గా ఈ సినిమా సూపర్ హిట్. సిద్ శ్రీరామ్ పాడారంటే తప్పకుండా ఆ పాటలో విషయం ఉంటుంది. సనారె లిరిక్స్ చాలా అందంగా రాశారు. టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్. ఈ సినిమా అన్ని భాషల్లో బిగ్ హిట్ కావాలని కోరుకుంటున్నాను'అన్నారు.
డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ, నాకు ఎప్పటినుంచో తెలుగు సినిమా చేయాలనే ఆలోచన ఉండేది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. బ్రాట్ సినిమాని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాము. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాము. అందరికీ రిలేట్ అయ్యే కథ ఇది. అర్జున్ జన్య యుద్ధమేరాని పాత అద్భుతంగా కంపోజ్ చేశారు. కన్నడ తెలుగు రెండు భాషల్లో కూడా సిద్ శ్రీరామ్ గారు ఈ పాటని అద్భుతంగా పాడారు అన్నారు
నిర్మాత మంజునాథ్ మాట్లాడుతూ, ఈ పాట లాగే సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుంది. చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది. తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను చూసి పెద్ద విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను'అన్నారు.
హీరో డార్లింగ్ కృష్ణ మాట్లాడుతూ, సిద్ శ్రీ రామ్ వాయిస్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన ఈ సాంగ్ పాడటం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా సినిమాను చూసి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను'అన్నారు.
హీరోయిన్ మనీషా మాట్లాడుతూ, సిద్ శ్రీరామ్ గారు వండర్ఫుల్ గా పాడారు. డైరెక్టర్ గారి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కృష్ణ గారితో పని చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. నరేష్ గారు మా సాంగ్ ని లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది'అన్నారు