Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

Advertiesment
Rashmika, Suresh babu and team

దేవీ

, సోమవారం, 28 జులై 2025 (10:54 IST)
Rashmika, Suresh babu and team
గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో మైసా చిత్రం రూపొందుతోంది. ఇందులో గోండ్ మహిళగా రష్మిక మందన్నా నటిస్తోంది. కులు బాషకు చెందిన రష్మికకు ఇటువంటి పాత్ర రావడం చాలా ఆనందంగా వుందని వ్యక్తం చేస్తోంది. రష్మిక మందన్న ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ అవాతర్ లో కనిపిస్తుంది. నేటి నుంచి ఈ సినిమా హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో రష్మికపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
 
రవీంద్ర పుల్లె డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్న 'మైసా' చిత్రం పవర్‌ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ తో రాబోతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించింది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్  మైసాను భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
 
రామానాయుడు స్టూడియోలో నిన్న జరిగిన పూజా కార్యక్రమంలో సురేష్ బాబు క్లాప్‌ కొట్టారు. రవి కిరణ్ కోలా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేసిన హను రాఘవపూడి ముహూర్తపు షాట్‌కు గౌరవ దర్శకత్వం చేశారు.
 
ఈ చిత్రానికి సూర్య ‘రెట్రో’ సినిమాకి పని చేసిన శ్రేయాస్ పి కృష్ణ డీవోపీగా పని చేస్తున్నారు. యాక్షన్ ని ‘కల్కి 2898 ఏ డీ’ ఫేమ్ ఆండి లాంగ్ డిజైన్ చేస్తున్నారు. మిగతా టెక్నిషియన్స్ విషయంలో సర్ప్రైజెస్ వుంటాయి. మొదటగా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో రివీల్ చేయబోతున్నారు. మరిన్ని ఎక్సైటింగ్ అప్‌డేట్స్ రానున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు