Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

Advertiesment
woman with lover

ఠాగూర్

, ఆదివారం, 27 జులై 2025 (17:22 IST)
సామాజిక మాధ్యమమైన ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడి కోసం కన్నబిడ్డను ఓ కన్నతల్లి బస్టాండులో వదిలేసి వెళ్లిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా ఆర్టీసీ బస్టాండులో ఈ హృదయ విదారకమైన సంఘటన జరిగింది. 
 
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ యువకుడు నల్గొండలో ఉన్నట్టు చెప్పాడు. దీంతో తన బిడ్డతో పాటు ఆ మహిళ హైదరాబాద్ నుంచి నల్గొండకు వచ్చింది. బస్టాండులో యువకుడుని చూడగానే ఆ మహిళ కన్నబిడ్డను అక్కడే వదిలివేసి, ఆ యువకుడుతో కలిసి బైకులో వెళ్లిపోయింది.
 
కన్నతల్లి బస్టాండులో వదిలివేయడంతో ఆ మగబిడ్డ గుక్కపెట్టి ఏడుపు మొదలుపెట్టడంతో ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు... ఆ బిడ్డను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆ బిడ్డ తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకుని బాలుడుని అప్పగించారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...