Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

02-09-2025 మంగళవారం ఫలితాలు - ఆరోగ్యం జాగ్రత్త.. అతిగా శ్రమించవద్దు...

Advertiesment
rishabham-2

రామన్

, మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
గ్రహాల సంచారం అనుకూలం. చిత్తశుద్ధిని చాటుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మొదలెట్టిన పనులు చురుకుగా సాగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. ఆప్తులతో సంభాషిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిచయస్తుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. వ్యతిరేకించిన వారే మీ విజ్ఞతను గుర్తిస్తారు. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ కష్టం ఫలిస్తుంది. ప్రముఖుల ప్రశంసలందుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ధనసహాయం తగదు. పనులు సానుకూలమవుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలు ముగుస్తాయి. ఖర్చులు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టిపెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. అవకాశాలు చేజారిపోతాయి. నిస్తేజానికి లోనవుతారు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉపశమనం కలిగిస్తాయి. పత్రాలు అందుకుంటారు. పనులు చురుకుగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. యత్నాలకు పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యం. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ఆచితూచి అడుగేయాలి. దంపతుల మధ్య దాపరికం తగదు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
పరిస్థితులు అనుకూలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దమొత్తం నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
మీ రంగంలో రాణిస్తారు. మీ కష్టం వృధాకాదు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆదాయం సంతృప్తికరం. విలాసాలకు వ్యయం చేస్తారు. పొగిడేవారితో జాగ్రత్త. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
పొదుపు ధనం అందుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. పిల్లల కదలికలపై దృష్టి సారించండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఒప్పందాల్లో మెలకువ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. ధనమూలక సమస్యలు ఎదురవుతాయి. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పనులు అర్ధాంతంగా ముగిస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి 
మీ జోక్యంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. రాబడిపై దృష్టి పెడతారు. పనులు వేగవంతమవుతాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. విదేశాల్లోని పిల్లల క్షేమం తెలుసుకుంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Bathukamma: బ్రెజిల్ రియో ​​కార్నివాల్ స్థాయిలో బతుకమ్మ పండుగను నిర్వహిస్తాం: జూపల్లి