మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అనుకూలతలు నెలకొంటాయి. ఖర్చులు సామాన్యం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. పిల్లల దూకుడు అదుపు చేయండి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. నిలిచిపోయిన పనులు ఎట్టకేలకు పూర్తవుతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. ఖర్చులు విపరీతం. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
చిత్తశుద్ధిని చాటుకుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. ఖర్చులు విపరీతం. చేసిన పనులే చేయవలసి వస్తుంది. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. ద్విచక్రవాహనంపై దూరప్రయాణం తగదు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
పరిచయాలు బలపడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా ఉంటుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు విరాలు గోప్యంగా ఉంచండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. ముఖ్యులతో సంభాషిస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. పనులు సజావుగా సాగుతాయి. ధనసహాయం తగదు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. దంపతులు మధ్య అవగాహన నెలకొంటుంది. నోటీసులు అందుకుంటారు. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు జాగ్రత.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం ఉండదు. నిస్తేజానికి లోనవుతారు. ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులను కలుసుకుంటారు. ప్రయాణం తలపెడతారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆచితూచి వ్యవహరించాలి. ప్రలోభాలకు లొంగవద్దు. కొంత మొత్తం అందుతుంది. పనులు సాగక విసుగు చెందుతారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఆరాంటంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. వాయిదా పడిన పనులు పూర్తిచేస్తారు. సంతానం విషయంలో మంచి జరుగుతుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సమర్థతను చాటుకుంటారు. విమర్శించిన వారే ప్రశంసిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. పనులు మందకొడిగా సాగుతాయి. పొదుపు ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.