Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

25-08-2025 సోమవారం ఫలితాలు - ఒప్పందాల్లో జాగ్రత్త.. ఏకపక్ష నిర్ణయాలు తగవు...

Advertiesment
astrology

రామన్

, సోమవారం, 25 ఆగస్టు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఒప్పందాల్లో జాగ్రత్త. ఏకపక్ష నిర్ణయాలు తగవు. నమ్మిన వారే మోసగించేందుకు యత్నిస్తారు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు విపరీతం. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. ఆరోగ్యం బాగుంటుంది. పాత పరిచయస్తులు తారసపడతారు. కీలక సమావేశంలో పాల్గొంటారు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ధనలాభం ఉంది. ఆప్తులకు సాయం అందిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో తలమునకలవుతారు. బంధుమిత్రులు అంతర్యం అవగతమవుతుంది. అనాలోచితంగా వ్యవహరించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. పట్టుదలతో శ్రమించిన గాని పనులు కావు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ప్రయాణం తలపెడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. పనులు అనుకున్న విధంగా సాగవు. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. విలువైన వస్తువులు జాగ్రత్త. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఓర్పుతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. దుబారా ఖర్చులు విపరీతం. సన్నిహితులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. పనులు ముందుకు సాగవు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ అభిప్రాయాలను కచ్చితంగా తెలియజేయండి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
అనుకూలతలున్నాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులు హడావుడిగా సాగుతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. మీ ప్రమేయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కొత్త యత్నాలు చేపడతారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు విపరీతం. పనులు వేగవంతమవుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. పత్రాల రెన్యువల్లో మెళకువ వహించండి.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాలు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. శ్రమించినా ఫలితం ఉండదు. మీ కష్టం మరొకరికి లాభిస్తుంది. యత్నాలకు సన్నిహితులు సహకరిస్తారు. సకాలంలో పనులు పూర్తవుతాయి. ఖర్చులు విపరీతం. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. బంధువులతో సంభాషిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సమర్థతను చాటుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. మీ జోక్యం అనివార్యం. పందాలు, బెట్టింగ్ల జోలికి పోవద్దు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మాట నిలబెట్టుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పనుల సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Ganesh Chaturthi 2025: వక్రతుండ మహాకాయ