మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇతరుల బాధ్యతలు చేపట్టవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాప్యం తగదు. బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం సిద్ధిస్తుంది. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వాయిదా వేసిన పనులు పూర్తి చేస్తారు. సన్నిహితులకు సాయం అందిస్తారు. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ఆధ్మాకతికత పెంపొందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. సమస్యను ఇట్టే పరిష్కరిస్తారు. మీ సమర్ధతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. కీలక పత్రాలు అందుతాయి. కొత్తయత్నాలు మొదలెడతారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యాన్ని సాధిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఖర్చులు విపరీతం. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. పనుల్లో ఒత్తిడి అధికం. అవకాశాలు దక్కించుకుంటారు. ప్రయాణంలో జాగ్రత్త
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారిపోతాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. సన్నిహితులను కలుసుకుంటారు. పోగొట్టుకున్న పత్రాలు అతికష్టంమ్మీద సంపాదిస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. ఎదుటివారి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. విమర్శించిన వారే మీ సమర్ధతను గుర్తిస్తారు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. మీ నిజాయితీ ప్రశంసనీయమవుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఖర్చులు అధికం. వేడుకకు హాజరవుతారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలి వెళ్లకండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహారాలను సమర్ధంగా నడిపిస్తారు. ఖర్చులు విపరీతం. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతులు అవగాహనకు రాగల్గుతారు. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. మీ సాయంతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. బంధువులతో విభేదిస్తారు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అన్ని విధాలా అనుకూలం. లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఖర్చులు అధికం. పనులు త్వరితగతిన పూర్తవుతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. అయిన వారిని సంప్రదిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆధ్మాత్మికత్తా పెంపొందుతుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. పట్టుదలతో యత్నాలు సాగించండి. అనవసర జోక్యం తగదు. నమ్మకస్తులే తప్పుదారి పట్టిస్తారు. పనులు పురమాయించవద్దు. ఖర్చులు సామాన్యం. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. ఏకాగ్రతతో వాహనం నడపండి.