Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15-08-2025 శుక్రవారం దినఫలాలు - నిస్తేజానికి లోనవుతారు.. ఖర్చులు అధికం...

Advertiesment
mennam-12

రామన్

, శుక్రవారం, 15 ఆగస్టు 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం 
రుణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అధికం. చేపట్టిన పనులు ముందుకు సాగవు. దంపతుల అకారణ కలహం. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ప్రయాణం తలపెడతారు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. మీ జోక్యం అనివార్యం. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. చిన్ననాటి పరిచయస్తులు తారుసపడతారు. యోగాపై ఆసక్తి కలుగుతుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, వ్యవహా జయం ఉన్నాయి. రావలసిన ధనం అందుతుంది. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. అనవసర జోక్యం తగదు. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఖర్చులు అధికం. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషపరుస్తుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలతో సతమతమవుతారు. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. పరిచయస్తులు మీ వ్యాఖ్యలను తప్పుపడతారు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఖర్చులు సామాన్యం. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఊహించని ఖర్చు చికాకుపరుస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. గుట్టుగా యత్నాలు సాగించండి. బంధువులు మీ ఆలోచనలను నీరుగారుస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. ప్రియతములను కలుసుకుంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పెద్దల చొరవతో సమస్య సానుకూలమవుతుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ కష్టం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు వేగవంతమవుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఖర్చులు విపరీతం. పత్రాలు అందుకుంటారు. పిల్లల కృషి ఫలిస్తుంది. గృహమరమ్మతులు చేపడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ప్రతికూలతలను అధిగమిస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఖర్చులు అధికం. చెల్లింపుల్లో జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. తలపెట్టిన కార్యం ముందుకు సాగదు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అన్నివిధాలా అనుకూలమే. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసాధనకు పట్టుదల ప్రధానం. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఖర్చులు అదుపులో ఉండవు. ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సామాజిక, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Janmastami 2025: కదంబ వృక్షంతో శ్రీకృష్ణునికి వున్న సంబంధం ఏంటి?