Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Janmastami 2025: కదంబ వృక్షంతో శ్రీకృష్ణునికి వున్న సంబంధం ఏంటి?

Advertiesment
Lord Krishna

సిహెచ్

, గురువారం, 14 ఆగస్టు 2025 (19:58 IST)
కదంబ వృక్షానికి శ్రీకృష్ణుడితో చాలా దగ్గరి సంబంధం ఉంది. గోపికల చీరలను ఈ చెట్టు మీదనే దాచాడని, రాధాకృష్ణుల ప్రేమకథలు ఈ చెట్టు నీడలోనే జరిగాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణం వల్ల ఉత్తర భారతంలో దీనిని కృష్ణ వృక్షం అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో, ఈ వృక్షాన్ని పార్వతి వృక్షం అని పిలుస్తారు. జగజ్జనని అమ్మవారిని కదంబవనవాసినిగా పూజిస్తారు. లలితాదేవి పూజలో కదంబ పుష్పాలను ఎక్కువగా ఉపయోగిస్తారు.
 
హనుమంతుని పుట్టుకకు ఈ వృక్షం మూలమని కూడా కొన్ని కథలు చెబుతాయి. ఈ చెట్టును పూజిస్తే పాపాలు తొలగిపోతాయని, గ్రహ దోషాలు ఉన్నవారు అమ్మవారిని కదంబ పుష్పాలతో పూజిస్తే దోష పరిహారం జరుగుతుందని నమ్ముతారు. కదంబ వృక్షం కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా, ఔషధ గుణాల పరంగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

18న శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు - 25న ప్రత్యేక దర్శన టిక్కెట్లు రిలీజ్