మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
నిర్విరామంగా శ్రమిస్తారు. కార్యం సిద్ధిస్తుంది. లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. దుబారా ఖర్చులు విపరీతం. పెట్టుబడులు కలిసిరావు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు సాగవు. ఆహ్వానం అందుకుంటారు. ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నమ్మకం నిజమవుతుంది. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అవకాశాలు చేజారిపోతాయి. దంపతుల మధ్య అకారణ కలహం. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వాగ్ధాటితో నెట్టుకొస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు ప్రయోజనకరం. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. పెద్దలను సంప్రదిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. మానసికంగా స్థిమితపడతారు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. శ్రమించినా ఫలితం ఉండదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త యత్నాలు చేపడతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వస్తులాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ఒక పట్టాన సాగవు. మీ కష్టం మరొకరికి కలిసివస్తుంది. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
మీ అభిప్రాయాలకు స్పందన ఉండదు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. మీ మాటతీరును కొంతమంది వక్రీకరిస్తారు. అనవసర జోక్యం తగదు. పెద్దఖర్చు తగలే ఆస్కారం ఉంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
చేపట్టిన కార్యం విజయవంతమవుతుంది. లక్ష్యానికి చేరువవుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సన్నిహితుల కలయికతో కుదుటపడతారు. రావలసిన ధనం సమయానికి అందదు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యసిద్ధి, వాహనసౌఖ్యం ఉన్నాయి. సమర్ధతను చాటుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్నింటా మీదే పైచేయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పత్రాలు జాగ్రత్త. స్నేహసంబంధాలు బలపడతాయి. పనులు అప్పగించవద్దు. తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు.